తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 555 మంది మరణించారు. ముఖ్యంగా ఇరాన్ ఇరాన్ సర్వ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయిల్ తో పాటు వారికి సహకరించిన దేశాలపైన కూడా ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది.
తెలంగాణ భవన్‌లో 24గంటల కంట్రోల్ రూమ్
దీంతో గల్ఫ్ దేశాలు తాజా పరిణామాలతో ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. దాడులు తక్షణమే ఆపాలంటే, లేదంటే తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అన్ని చర్యలు తీసుకుంటామని, దూకుడుగా ప్రతిస్పందించగలం. పశ్చిమాన నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ తెలంగాణ పౌరుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని తెలంగాణ భవన్‌లో 24గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.

ఇబ్బందుల్లో ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
విదేశాంగత్వ శాఖ, భారత రాయబార మంత్రి కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న వారు, వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం వందన బరువా – 9871999044, చక్రవర్తి – 9958322143, జావేద్ హుస్సేన్ – 9910014749, రక్షిత్ నాయక్ – 9643723157 మొబైల్ నంబర్ల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు.
తెలంగాణా వాసులు ఆందోళన వద్దన్న మంత్రి అడ్లూరి
ప్రయాణ, ఇతర అత్యవసర సమయాల్లో అవసరమైన సమన్వయం, సహాయాన్ని అందించడానికి ఈ బృందం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంతో కలిసి పౌరుల క్షేమం కోసం నిరంతరం కృషి తెలంగాణ సర్కార్ భరోసా ఇచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో అక్కడ ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలంగాణా వాసులు ధైర్యంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
అవసరమైన సహాయం చేస్తాం అన్న మంత్రి అడ్లూరి
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణా వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అక్కడున్న వారు తమ యోగక్షేమాలను కుటుంబ సభ్యులకు, అధికారులకు తెలియజేయాలని సూచించారు. నిరంతర సమీక్షల ద్వారా తెలంగాణ పౌరులకు అవసరమైన సహాయం అందజేసే మంత్రి భరోసా ఇచ్చారు.

