భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
జార్ఖండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. ఛత్రా జిల్లా సిమారియా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆనందం విమానం. ఓ రోగిని మెరుగైన వైద్య చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. రాంచీ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం 7:11 నిమిషాలకు టేకాఫ్ అయింది. ఆ కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.
ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న ఏడుగురూ ఈ ప్రమాదంలో మరణించినట్లు ఛత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ తెలిపారు. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఎయిర్ అంబులెన్స్ రాడార్ నుంచి అదృశ్యమైంది. సిమారియాలోని బరియాతు పంచాయతీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు వెలికితీసినట్లు ఎస్డీపీవో శుభం ఖండేల్‌వాల్పేర్కొన్నారు. మృతులను కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా పేర్కొన్నారు.

#చూడండి | జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలోని కసరియా పంచాయతీ, సిమరియా బ్లాక్‌లో ఏడుగురు వ్యక్తులతో (ఇద్దరు సిబ్బందితో సహా) ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది.
ఇది రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ బీచ్‌క్రాఫ్ట్ C90 ఎయిర్‌క్రాఫ్ట్ VT-AJV వైద్య తరలింపు (ఎయిర్ అంబులెన్స్)ని నిర్వహిస్తోంది… pic.twitter.com/xmr9OOcdNh
– ANI (@ANI) ఫిబ్రవరి 24, 2026

