భారతదేశం
ఓయ్-కొరివి జయకుమార్
ప్రేమకు.. వయస్సు, మతం ఏది అడ్డుకాదని నిరూపించేలా బీహార్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఔరాయ్‌కు చెందిన 60 ఏళ్ల ప్రైవేట్ స్కూల్ యజమాని రాకేష్ షా, అదే స్కూల్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు షైస్తా పర్వీన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాజం, కుటుంబ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ జంట ఊరు విడిచి నేపాల్ వెళ్లి ఆలయంలో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పరిచయం నుంచి ప్రేమ వరకు..
కాగా రాకేష్ షా అయిన ప్రైవేట్ స్కూల్‌లో షైస్తా పర్వీన్ టీచర్‌గా చేరిన తర్వాత ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. రోజువారీ పనిలో కలిసి గడిపిన సమయం క్రమంగా దగ్గరితనాన్ని పెంచి ప్రేమగా మారింది. ఈ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత అభ్యంతరాలు రావడంతో, ఫిబ్రవరి 18న ఇద్దరూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.

నేపాల్‌లో గోప్యంగా వివాహం..
కొద్ది రోజుల తర్వాత సరిహద్దు దాటి నేపాల్ చేరుకున్న ఈ జంట అక్కడికి ఒక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన వీడియోలో ఇద్దరూ సంతోషంగా కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చలు మరింత పెరిగాయి.
వీడియో విడుదల..
పెళ్లి అనంతరం షైస్తా పర్వీన్ విడుదల చేసిన వీడియోలో తన నిర్ణయం స్వచ్ఛందమని స్పష్టం చేసింది. “నేను నా ఇష్టంతోనే ఈ వివాహం చేసుకున్నాను. నా కొత్త జీవితంతో సంతోషంగా ఉన్నాను. ఎవరూ బలవంతం చేయలేదు. రాకేష్ కుటుంబాన్ని వేధించకండి” అని ఆమె విజ్ఞప్తి చేసింది. అయితే షైస్తా సోదరుడు పోలీసులను ఆశ్రయించి రాకేష్ షాపై ఫిర్యాదు చేశారు. నలుగురు అయిన రాకేష్ తన సోదరిని కిడ్నాప్ చేసి మత మార్పిడి ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడని పిల్లల తండ్రి.
ఈ ఫిర్యాదు ఆధారంగా రాకేష్ భార్య, కుమార్తెతో సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఇద్దరూ మతాలకు చెందిన వారు కావడంతో ఔరాయ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాగ్రత్త చర్యగా స్కూల్ మరియు రాకేష్ నివాసానికి తాళాలు వేసినట్లు. గ్రామంలో పోలీసులు గస్తీ పెంచగా, వైరల్ అవుతున్న వీడియోలు నిజానిజాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

