Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅట్టుడుకుతున్న కామారెడ్డి.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయన్న కేంద్రమంత్రి | కామారెడ్డిలో ఉద్రిక్తత: బండి సంజయ్‌...

అట్టుడుకుతున్న కామారెడ్డి.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయన్న కేంద్రమంత్రి | కామారెడ్డిలో ఉద్రిక్తత: బండి సంజయ్‌ హౌస్‌ అరెస్ట్‌లపై నిప్పులు చెరిగారు, తెలంగాణలో ‘ఎమర్జెన్సీ తరహా’ పరిస్థితి ఉందని ఆరోపించారు.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

కామారెడ్డిలో ఉద్రిక్తతలు చల్లారలేదు. కామారెడ్డి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బిజెపి నేతలు తాము కామారెడ్డి వెళ్లి తీరుతామని పోలీసులు స్పష్టం చేశారు. కామారెడ్డి కి వెళ్లాలని ప్రయత్నిస్తున్న ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

కామారెడ్డిలో చల్లారని ఉద్రిక్తతలు

కామారెడ్డిలో మొదలైన రాజకీయ ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో చిలికి చిలికి గాలివానగా మారి సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకునే వరకు వెళ్ళింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన పోసానిపేట మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి తన కారుతో ఎమ్మెల్యే క్యాంపుకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కామారెడ్డిలో ఉద్రిక్తత బండి సంజయ్ హౌస్ అరెస్ట్ ఆరోపణ తెలంగాణాలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందా? భగ్గుమన్న బండి సంజయ్

బిజెపి కార్యకర్తలు కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఎవరు కామారెడ్డికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు.ఇక పరిశీలించకుండా కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేమిటి అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు

రాష్ట్రంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం అవ్వాలని. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోవాలని, కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దారుణమని బండి సంజయ్ అన్నారు.

బాన్సువాడలో 70 మంది అరెస్ట్ అక్రమం అన్న కేంద్రమంత్రి

బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమని, కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ఆత్మరక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటన్నారు. బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమమని, రాళ్ళ దాడి స్పష్టంగా కనిపిస్తున్న చర్యలు ఎందుకు లేవని బండి సంజయ్ ప్రశ్నించారు. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఎంఐఎం ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular