అంతర్రాష్ట్ర బదిలీలకు ఏపీలో వివరాలు సేకరణ
తెలంగాణ , ఫిబ్రవరి 05, (సీమకిరణం న్యూస్) :
అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా గతంలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు సమ్మతి ఇచ్చిన ఉద్యోగుల నుంచి ఏపీ పాఠశాల విద్యా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. విద్యా శాఖలో పని చేస్తున్న 229మంది అంతర్రాష్ట్ర బదిలీలకు ఐచ్ఛికాలు ఇచ్చారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసి స్టెంట్లు, ఎంఈవోలు, సహాయ సంచాలకులు ఉన్నారు. స్పౌజ్, వ్యక్తిగత, మెడికల్, లోకల్ కేటగిరీల కింద బదిలీల్లో వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ ప్రక్రి యలో కొంత జాప్యం జరిగినందున కొంతమంది ఉద్యో గులు పదవీ విరమణ చేయడం, పదోన్నతి పొందడం, తెలంగాణకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడంలాంటి కార ణాలు ఉన్నందున మొదటి జాబితాను నవీకరించేం దుకు పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరిస్తోంది. వివరాలను తక్షణమే పంపించాలని సూచించింది. ప్రత్యేక ఫార్మెట్లు ఇచ్చింది. వివరాల సేకరణ అనంతరం తుది జాబితాను రెండు, మూడు రోజుల్లో తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది. ఇప్పుడు కొత్తగా ఎవ్వరినీ అనుమతించరాదని జిల్లా స్థాయి అధికారులకు సూచిం చింది. కొత్త వారికి సైతం అవకాశం కల్పించాలని ఏపీ టీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు.

