Wednesday, September 9, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలీస్ కంట్రోల్ రూమ్ హెడ్ కానిస్టేబుల్ తిరుపాలకు ఘన సన్మానం

పోలీస్ కంట్రోల్ రూమ్ హెడ్ కానిస్టేబుల్ తిరుపాలకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పోలీస్ కంట్రోల్ రూమ్ హెడ్ కానిస్టేబుల్ తిరుపాలకు ఘన సన్మానం

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 31, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన తిరుపాలు దంపతులను సోమవారం కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ తిరుపాలు దంపతులను శాలువాతో కప్పి, పూలమాలలు వేసి ఆత్మీయంగా సత్కరించారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన సుదీర్ఘ సేవలను, విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం 1994–95 సివిల్ పోలీస్ బ్యాచ్‌కు చెందిన సహచరులు, బ్యాచ్ మిత్రులు తిరుపాలు దంపతులను ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ తర్వాత తిరుపాలు దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజుతో పాటు బ్యాచ్ మిత్రులు జావిద్, చంద్రకాంత్, సిద్దేశ్వర ప్రసాద్, ఖాజా, ఖాద్రి, ప్రసాద్ సింగ్, గోవిందు, అజ్మతుల్లా బేగ్, శ్రీనివాసులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular