seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 11:08 pm Digital Edition : SEEMA KIRANAM

US-Israel-Iran War: 1,230 మంది మృతి.. | ఇరాన్ మరణాల సంఖ్య 1200 దాటింది: పెరుగుతున్న సంక్షోభం మధ్య ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సాయిప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటిదాకా దాదాపు 1200 మంది కంటే ఎక్కువ మంది మృతి చెందినట్లు సమాచారం.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకూ ఇరాన్‌లో 1000 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. అలాగే లెబనాన్ లో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ లో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. అలాగే యూఎన్ అందించిన సమాచారం ప్రకారం దాదాపు లక్ష మంది పౌరులు ఇరాన్ నుంచి వలస వెళ్లినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన 2 రోజుల్లోనే ఈ వలసలు ప్రారంభమయ్యాయి.

మరోవైపు ఇజ్రాయెల్ మరోసారి ఫ్రెష్ అటాక్స్ చేస్తోంది. ఇరాన్ లోని టార్గెట్ స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. అలాగే లెబనాన్, బీరట్ లోని హెజ్ బొల్లా స్థావరాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలు నమోదవుతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్ సేత్.. యుద్ధ పరిధి విస్తరిస్తోందని అన్నారు. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కు చెందిన యుద్ధనౌకను అమెరికా ముంచేసిందని తెలిపారు.

ఇరాన్ మరణాల సంఖ్య 1200 దాటింది, సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు

ఇక లెబనాన్ లో ఇరాన్ కు చెందిన హెజ్ బొల్లా గ్రూప్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అలాగే బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్ లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచమార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రేల్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ఇరాన్.. హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

మేక్రాన్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్..

ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ మాట్లాడారు. పశ్ఛిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ త న అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య సమస్యలు కావాలని అభిప్రాయపడినట్లు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తమ మద్దతు ఉందని వివరించారు.

Source link