seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 4:29 am Digital Edition : SEEMA KIRANAM

US షట్‌డౌన్: నిలిచిపోయిన ‘గ్లోబల్ ఎంట్రీ’ సేవలు | US షట్‌డౌన్: పార్టీల మధ్య ఇమ్మిగ్రేషన్ పాలసీ వరుస మధ్య DHS గ్లోబల్ ఎంట్రీ సేవలను సస్పెండ్ చేసింది

అంతర్జాతీయ

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

భారతీయులు వెళ్లాలనుకునే భారతీయులు, అమెరికా తరచుగా ప్రయాణాలు చేసే నిపుణులు, వ్యాపారవేత్తలకు ఇది ఒక రకమైన ‘షాక్’ ఇచ్చే వార్త. అమెరికా విమానాశ్రయాల్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకునే ‘గ్లోబల్ ఎంట్రీ’ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

అమెరికా ప్రభుత్వంలో తాత్కాలిక షట్ డౌన్ కారణంగా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఇమ్మిగ్రేషన్ విధానాలపై నెలకొన్న రాజకీయ పోరు వల్ల నిధులు నిలిచిపోవడంతో, ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం పాక్షిక స్తంభనలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎంట్రీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

US షట్‌డౌన్ DHS పార్టీల మధ్య ఇమ్మిగ్రేషన్ పాలసీ వరుస మధ్య గ్లోబల్ ఎంట్రీ సేవలను నిలిపివేసింది

గ్లోబల్ ఎంట్రీ అంటే ఏంటి?

సాధారణంగా విదేశాల నుంచి అమెరికా చేరుకున్న ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీల కోసం 30 నుంచి 90 నిమిషాల పాటు సుదీర్ఘ క్యూలలో వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో చాలా మంది ముందుగానే అనుమతి పొంది ‘గ్లోబల్ ఎంట్రీ’ సేవలను వినియోగించుకుంటారు. దీనివల్ల విమానాశ్రయాల్లోని ప్రత్యేక కియోస్కుల ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సేవలు నిలిచిపోవడంతో, గ్లోబల్ ఎంట్రీ కార్డు ఉన్న వారు కూడా సామాన్య ప్రయాణికులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చివరి నిమిషంలో..

వాస్తవానికి ముందుగా గ్లోబల్ ఎంట్రీతో పాటు డొమెస్టిక్ ప్రయాణికులకు వేగంగా సెక్యూరిటీ చెకింగ్ చేసే ‘టీఎస్‌ఏ ప్రి-చెక్’ (TSA PreCheck) సేవలను కూడా ఆపేయాలని ప్రభుత్వం భావించింది. 202లో దాదాపు 2 మంది అమెరికన్లు ఈ సేవలను వినియోగించుకున్న నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

సస్పెన్స్‌గానే..

ప్రస్తుతం కేవలం గ్లోబల్ ఎంట్రీని మాత్రమే నిలిపివేస్తున్నట్లు హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ట్రంప్ డిపోర్టేషన్ ప్రక్రియలో మార్పులు ఎప్పుడు చేయడం డెమోక్రాట్లు డిమాండ్ చేస్తుండటం, నియంత్రణ అధికార పక్షంతో ఏకాభిప్రాయం కుదర ఈ సేవలు మళ్లీ పునరుద్ధరిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.

ఆంగ్ల సారాంశం

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) పాక్షికంగా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా గ్లోబల్ ఎంట్రీ సేవలను నిలిపివేసినందున US ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఇమ్మిగ్రేషన్‌పై రిపబ్లికన్-డెమొక్రాట్ ప్రతిష్టంభన మీ ప్రయాణ సమయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి.

Source link