seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 6:39 am Digital Edition : SEEMA KIRANAM

TTD బిగ్ ఆఫర్: వారికి శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం, వసతి – ఇలా దరఖాస్తు చేసుకోండి..!! | తిరుమల-తిరుపతి ఆసుపత్రుల్లో శ్రీవారి సేవకులుగా పని చేసేందుకు ఆసక్తిగల వైద్యులు, వైద్య సిబ్బందికి టీటీడీ ఆహ్వానం

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తిరుమల: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సేవకుల తరహాలోనే వైద్య సేవలకు శ్రీవారి వైద్య సేవకులుగా ఆసక్తి ఉన్న వారికి అవకాశం నిర్ణయించింది. ఈ మేరకు వారికి దరఖాస్తు పైన స్పష్టత ఇస్తూ.. వారి సేవ పైన క్లారిటీ ఇచ్చింది. ఇక.. శ్రీవారి సేవకులుగా ముందుకు వచ్చిన వారికి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులతో సహా శ్రీవారి ప్రోటోకాల్ దర్శనంతో పాటుగా వసతి.. ప్రయాణం ఉచితంగా కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు పూర్తి వివరాలను పరిశీలించారు.

టీటీడీ శ్రీవారి వైద్య సేవకులుగా ముందుకు వచ్చే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవలు సిద్దమయ్యాయి. కాగా, ఇప్పటికే కొందరు సేవలు టీటీడీ ఆహ్వానం మేరకు ముందుకు వచ్చారు. వైద్యులతో పాటుగా వైద్య రంగంలో వివిధ విభాగాల్లో పని చేసే వారికి టీటీడీ శ్రీవారి వైద్య సేవకులుగా అవకాశం కల్పిస్తోంది. టీటీడీ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తూ రోగులకు అవసరమైన విధంగా అధునాతన శస్త్ర చికిత్సలు, బోధన, పరిశోధనలపై అధ్యయనం కోసం వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇలా ముందుకు వచ్చిన వారికి వారితో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇలా ముందుకు వచ్చేందుకు ఆసక్తి ఉన్న శ్రీవారి వైద్య సేవకులు ముందుగా టీటీడీ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి త్వరలోనే యాప్ కూడా అందుబాటులోకి తేనుంది. ఆసక్తి ఉన్న వారు నెలలో కనీసం వారం రోజుల పాటు సేవ కోసం సమయం కేటాయించాలి.

తిరుమల-తిరుపతి-హాస్పిలో-శ్రీవారి-సేవకులు-ఆసక్తిగల-వైద్య-సిబ్బందిని-పని చేయడానికి-టిటిడి-ఆహ్వానిస్తుంది

టీటీడీ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలే లక్ష్యంగా

వీరి కోసం స్విమ్స్ లో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసారు. వారికి కావాల్సిన సమాచారం కోసం ఫోన్ నంబరు 91542 16307, (ఇమెయిల్ రక్షించబడింది)లో సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్య సేవలు అందించేవారికి టీటీడీ అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. వేదిక్ వర్సిటీ, స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణాల్లో వసతి, భోజనం అందిస్తుంది. ఇక రవాణా ఖర్చులో కూడా భరిస్తున్నారు. వీరి కోసం భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక ఆఫీస్ కేటాయించారు. ఈ ఆఫీస్ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి చెందిన ప్రముఖ డాక్టర్లు కూడా ఒక వారం పాటు వచ్చి ఈ విధానంలో సేవలు అందించారు. ఇటీవల స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులను అంతర్జాతీయ వైద్య బృందం పర్యవేక్షించింది. సర్జరీలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేసింది. ఆ సూచన ప్రకారం ఇప్పుడు ఈ రెండు ఆస్పత్రుల్లో పలు మార్పులు చేస్తున్నారు. భక్తులతో పాటు స్థానిక ప్రజలకు వీరి ద్వారా వైద్య సేవలు అందించడం కొనసాగుతోంది.

ఆంగ్ల సారాంశం

తిరుపతి తిరుమల దేవస్థానం ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందించేందుకు టీటీడీ నిర్ణీత మార్గదర్శకాలు

Source link