అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని అన్నారు. ఇరాన్‌లో అన్ని లక్ష్యాలనూ ఛేదించినట్లు తెలిపారు. ఇరాన్ దగ్గర ఇంకేమీ మిగల్లేదని.. త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని ట్రంప్ చెప్పారు. ఇరాన్ లో దాడులు చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదని అన్నారు. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్, ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మొజ్తబా ఖమేనీ యుద్ధం ప్రారంభంలోనే గాయాలు పాలైనట్లు సమాచారం. ఇదే పరిశీలన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగిస్తామని అన్నారు. అమెరికా- ఇజ్రాయెల్ సైనిక చర్య ద్వారా ఇరాన్ కు ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్ లో దాదాపు అన్ని లక్ష్యాలను ఛేదించామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి మూసి వేయడం ఇంకా అనేక కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్.. ఇరాన్ పై దాదాపు కొన్ని నెలల పాటు జరిగిన యుద్ధం చెప్పిన విషయం తెలిసిందే.
ఇక అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌లోని చాలా లక్ష్యాలను ఇప్పటికే ధ్వంసం చేశాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తో యుద్ధం ముగింపు ఇప్పుడు తన చేతిలోనే ఉందని, అప్పుడు తాను ఎప్పుడనుకుంటే యుద్ధం క్లోజ్ చేస్తానని స్పష్టం చేశారు. ఇరాన్ కు ఆరు వారాల గడువు లోపు కూడా తాము ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టం కలిగించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా నెలకున్న అస్థిరతకు ఇరాన్ కారణమని ట్రంప్ స్పష్టం చేశారు.

అయితే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉందని ఆయన తాజాగా సంకేతాలిచ్చారు. ఈ యుద్ధం ఎటువంటి సమయ పరిమితి లేకుండా, అవసరమైనంత కాలం కొనసాగుతుంది. అన్ని లక్ష్యాలను సాధించి ఈ పోరాటంలో విజయం సాధించే వరకు ఇది ఆగదు అని కట్జ్ స్పష్టం చేశారు. దాంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వెనకడుగు వేయడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ప్రతిఘటిస్తూనే ఉంటామని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
ఆంగ్ల సారాంశం
ఇరాన్‌పై జరుగుతున్న యుఎస్-ఇజ్రాయెల్ దాడులు, వివాదం త్వరగా ముగియగలదని ట్రంప్ చేసిన ప్రకటన, ప్రపంచ చమురు సరఫరాలపై ఆశించిన ప్రభావం మరియు ఆర్థిక అంతరాయం మరియు భౌగోళిక రాజకీయ స్థిరత్వం గురించి విశ్లేషకుల ఆందోళనలను వ్యాసం చర్చిస్తుంది.