seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 1:57 am Digital Edition : SEEMA KIRANAM

Tirupati Express: తిరుపతి ఎక్స్ ప్రెస్ కు అన్నమయ్య జిల్లాలో అదనపు హాల్ట్..! | రేపు ప్రారంభమయ్యే తిరుపతి ఎక్స్‌ప్రెస్ ములకలచెరువు వద్ద కొత్త స్టాప్‌ను పొందుతుంది- ఇక్కడ సమయాలు ఉన్నాయి

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీలోని రాయలసీమలో ఉన్న అన్నమయ్య జిల్లా వాసులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తిరుపతి-అకోల మధ్య రాకపోకలు సాగించే తిరుపతి ఎక్స్ ప్రెస్ (తిరుపతి ఎక్స్‌ప్రెస్)కు అన్నమయ్య జిల్లాలో అదనపు స్టాప్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇక్కడి ప్రయాణికులు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్ ను పరిశీలించిన రైల్వేశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

రైల్వే తాజా నిర్ణయం ప్రకారం ఇకపై తిరుపతి-అకోలా-తిరుపతి ఎక్స్ ప్రెస్ అన్నమయ్య ములకలచెరువు స్టేషన్ లో కూడా ఆగబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. దీని ప్రకారం తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 07605 మధ్యాహ్నం 2.49కి ములకలచెరువు స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. అలాగే అకోలా-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 07606 తెల్లవారు జామున 2.34కు ములకలచెరువు స్టేషన్‌లో నిమిషం పాటు ఆగుతుంది. ఈ నిర్ణయం రేపు (ఆదివారం) నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే అనుమతి.

రేపు ప్రారంభమయ్యే తిరుపతి ఎక్స్‌ప్రెస్ ములకలచెరువు వద్ద కొత్త స్టాప్‌ను పొందుతుంది

తిరుపతి ఎక్స్ ప్రెస్ మహారాష్ట్రలోని అకోలా వరకూ ప్రయాణిస్తుంది. ఈ రైలుకు ప్రస్తుతం మొత్తం 23 స్టాప్‌లు ఉన్నాయి. రాయలసీమలోని పాకాల, మదనపల్లె రోడ్‌, కర్నూలు సిటీలో ఇప్పటికే స్టాప్‌లు ఉన్నాయి. వీటికి ములకలచెరువు అదనం.
ఈ రైలు తిరుపతి నుంచి రోజూ మధ్యాహ్నం 12:30కి బయలుదేరి, రెండో రోజు మధ్యాహ్నం 1:15కి అకోలాకు చేరుకుంటుంది. తిరిగి 07606 రైలు అకోలా నుంచి ఉదయం 8:10కి బయలుదేరి తిరుపతికి ఉదయం 6:25కి చేరుకుంటుంది. ఏపీ నుంచి బయలుదేరి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు ఇది రాకపోకలు సాగుతుంది.

Source link