seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 7:10 pm Digital Edition : SEEMA KIRANAM

telangana: మున్సిపల్ సమరం.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్.. | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న ఓటింగ్ ! ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది – మీ వాయిస్ కౌంట్స్!

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఎన్నికల మున్సిపల్ పోలింగ్ కోసం సర్వం సిద్ధం అయింది. ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం తేలనుంది.

రాష్ట్రంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 12,944 మంది మిగిలారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా 9 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. 12 మంది కాంగ్రెస్.. ఇద్దరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న ఓటింగ్ ఉదయం 7 గంటలకు మీ వాయిస్ కౌంట్స్ ప్రారంభం

ఇక మున్సిపల్ ఎన్నికల కోసం 8,20 పోలింగ్ కేంద్రాలు 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్‌లు అలాగే 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

Source link