seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:36 am Digital Edition : SEEMA KIRANAM

Silver:వెండి ధరలకు విస్ఫోటనం సంకేతాలు! సోమవారం జరగ ఏంబోతుంది | వెండి ధర పేలుడు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తత కారణంగా సోమవారం వెండి ధర రూ.3 లక్షల మార్కుకు చేరుకునే అవకాశం ఉంది.

[ad_1]

వ్యాపారం

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మధ్యప్రాచ్యం రగిలిపోతోంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను బూడిద చేసేలా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణి గర్జనలు.. వెరసి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ యుద్ధం ప్రభావం ఇప్పుడు నేరుగా విలువైన లోహాలైన బంగారం, వెండిపై పడబోతోంది. సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి వెండి ధరల్లో ఒక రకమైన ‘ధరల విస్ఫోటనం’ సంభవించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా యుద్ధం లాంటి అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే ‘సురక్షితమైన పెట్టుబడి’గా భావించే బంగారం, వెండి వైపు పరుగులు తీస్తుంది. అంతర్జాతీయ సంక్షోభం తలెత్తినప్పుడు బంగారం కంటే వెండి ధరల్లో వచ్చే మార్పులు అత్యంత వేగంగా, భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు మొదలయ్యాయి. సెలవుల్లో కూడా క్రిప్టో టోకెన్ ‘టెథర్ గోల్డ్’ 4 శాతం మేర పెరగడం మార్కెట్లో భయాన్ని కళ్లకు కడుతోంది. సోమవారం భారతీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) తెరిచేసరికి వెండి ధరలు ఊహించని రికార్డులను సృష్టించేలా ఉన్నాయి.

వెండి ధర పేలుడు ఇరాన్-ఇజ్రాయెల్ వార్ టెన్షన్‌తో సోమవారం వెండి ధర రూ. 3 లక్షల మార్కుకు చేరుకునే అవకాశం ఉంది.

వెండి ధరల అంచనా:

ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,80,000 రూ. 2,85,000 శ్రేణిలో కదలాడుతోంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది క్షణాల్లో రూ. 2,95,000 మార్కును చేరుకోవచ్చని విశ్లేషకులు. అంటే కేవలం ఒక్కరోజులోనే వేలల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.

ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోస్తున్న పరిస్థితులు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చలు విఫలం కావడం, అమెరికా ప్రత్యక్ష జోక్యం మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టాయి. దీనివల్ల డాలర్ ఇండెక్స్‌లో తీవ్ర మార్పులు రావడమే కాకుండా, ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల దిశగా పరుగులు తీస్తున్నాయి. పెరిగే చమురు ధరలు, పడిపోతున్న రూపాయి విలువ.. వెండి ధరలకు మరింత బలాన్ని (Bullish Trend) ఇస్తున్నాయి. ఇది కేవలం ఇన్వెస్టర్లకే కాకుండా, నగలు కొనుగోలు చేస్తే సామాన్య ప్రజలకు కూడా మోయలేని భారం ఉంది.

సోమవారం ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక అంశాలు:

  • గ్యాప్-అప్ ఓపెనింగ్: ఐసిఎక్స్ మార్కెట్ ముందటి ముగింపు కంటే ఎంత ఎక్కువ ధరతో ఓపెన్ అవుతుంది?
  • బంగారం ప్రభావం: ఐసిఎక్స్ బంగారం ధర రూ. 1,60,000 పైన స్థిరంగా ఉంటే, అది వెండి ధరను ఆకాశానికి చేరుస్తుంది.
  • ప్రాఫిట్ బుకింగ్: భారీ ధరల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతారా లేక లాభాల స్వీకరణ చేస్తారా అన్నది కీలకం.

వెండి: కొనలా? అమ్మాలా? నిపుణుల సూచనలు
యుద్ధ మేఘాలు ఎంత కాలం కమ్ముకుని ఉంటాయనే దానిపైనే ఈ ధరల పెరుగుదల ఉంటుంది. ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు యుద్ధంగా మారితే, వెండి ధరలు సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయం. కాబట్టి, సోమవారం మార్కెట్లను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం ఉత్తమం.

[ad_2]

Source link