seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 4:58 pm Digital Edition : SEEMA KIRANAM

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఆ జిల్లాల్లో వానలు! | ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ నవీకరణ బంగాళాఖాతంలో అల్పపీడనం రాయలసీమ మరియు దక్షిణ కోస్తాకు వర్ష హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మెల్లమెల్లగా సెగలు పుట్టిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల వాతావరణం ఒక్కసారిగా మారనుంది.

సముద్ర మట్టంలో ఏర్పడిన మార్పులను గమనిస్తే.. ప్రస్తుతం రెండు చోట్ల వాతావరణం అలజడి కొనసాగుతోంది. నిన్న హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం నేడు (ఫిబ్రవరి 20) బలహీనపడింది. అయితే, దీని ప్రభావంతో ఏర్పడిన ఆవర్తనం శ్రీలంక వైపు కదులుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ నవీకరణ బంగాళాఖాతంలో అల్పపీడనం రాయలసీమ మరియు దక్షిణ కోస్తాకు వర్ష హెచ్చరిక

మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో నివాసం ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

మూడు రోజుల వాతావరణం అంచనా

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల దిగువన ట్రోపో ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలు వీస్తున్నాయి. దీని ఫలితంగా వచ్చే మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండబోతోంది:

  • ఉత్తర కోస్తా & యానాం: రాబోయే మూడు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుంది. అయితే, రేపు (శనివారం) ఒకటి లేదా రెండు చోట్ల తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది.
  • దక్షిణ కోస్తా: ఈరోజు, రేపు పొడి వాతావరణం కనిపిస్తుంది.. ఎల్లుండి (ఆదివారం) నుంచి వాతావరణం చల్లబడనుంది. ఒకటి రెండు చోట్ల కాంతి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
  • రాయలసీమ: సీమ వాసులకు వర్ష గండం పొంచి ఉంది. ఈరోజు వాతావరణం పొడిగా ఉన్నా, రేపు మరియు ఎల్లుండి రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.

ఎండలు మండుతున్నాయి..

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజా ప్రకారం.. కర్నూలులో అత్యధికంగా 36.3 ఉష్ణోగ్రత నమోదై భగభగ మొదలయ్యాయి. ఇక కళింగపట్నంలో కనిష్టంగా 30.9 ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అల్పపీడనతో వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

ఫిబ్రవరి 20 2026న ఆంధ్రప్రదేశ్ వాతావరణ నవీకరణ. రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే కారణంగా రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలో వర్ష హెచ్చరికను అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Source link