seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:42 am Digital Edition : SEEMA KIRANAM

Prashanti Express: ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్-ఇకపై ఇలా..! | మెరుగైన ఆన్‌బోర్డ్ సేవల ప్రారంభ దశ కోసం రైల్వే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ (Prashanti Express)ప్రయాణికులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వందే ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ వంటి ప్రీమియం రైళ్లను కలిగి ఉండే తరహాలోనే ఇతర దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న రైళ్లను సైతం పరిశుభ్రంగా ఉంచాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఇందులో తొలిదశ సంస్కరణలకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎంపికైంది.

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు గుడ్ న్యూస్ (ప్రశాంతి ఎక్స్ ప్రెస్)

‘బెటర్ ఆన్ బోర్డ్ సర్వీసెస్’ పేరుతో రైల్వే చేపడుతున్న సంస్కరణల్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వరాష్ట్రమైన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగించే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ఈ మార్పులు చేపట్టనున్నారు. ప్రశాంతి ప్రెస్ తో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని మొత్తం ఆరు రైళ్లలో ఇలా తాజా సంస్కరణలు జరిగాయి. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వేకు సమాచారం అందించింది.

మెరుగైన ఆన్‌బోర్డ్ సేవల ప్రారంభ దశ కోసం రైల్వే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంది

పరిశుభ్రంగా అన్ని కోచ్ లు

కేంద్రం చేపట్టే ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ కోచ్ లతో పాటు ఇతర అన్ని కోచ్ లనూ శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రయాణికులకు అందించే సౌకర్యాలను కూడా మెరుగుపర్చబోతున్నారు. దీంతో ఇకపై మూడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవం లభిస్తుందని తూర్పు కోస్తా రైల్వే అంచనా వేస్తోంది.

మెరుగైన ఆన్‌బోర్డ్ సేవల ప్రారంభ దశ కోసం రైల్వే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంది

తొలి దశలో ఇలా..

వచ్చే ఏడాది కాలంలో అంటే 52 వారాల్లో ఎంపిక చేసిన రైళ్లలో 52 సంస్కరణలు జరిగాయి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా. తొలి దశలో వచ్చే ఆరు నెలల్లో 80 దూర ప్రాంతం, రద్దీగా నడిచే రైళ్లను ఎంపిక చేశారు. వచ్చే మూడేళ్లలో ఈ సంస్కరణల్ని అన్ని రైళ్లకు విస్తరిస్తారు. గతంలో రిజర్వుడ్ కోచ్ లను మాత్రమే ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే ఇలా క్లీన్ చేసేవారు. కానీ ఇప్పుడు నిరంతరాయంగా అన్ని కోచ్ లలోనూ చేపట్టబోతున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

Source link