భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
ప్రస్తుతం ఉన్న ప్రధాన విమానాశ్రయాల్లో గురువారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్లు, చెక్-ఇన్ ప్రక్రియకు కీలకమైన ‘నెవిటేర్’ (నావిటైర్) సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాల్లో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే వేచి చూడాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే!
గురువారం ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సమస్య మొదలైంది. ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్, బోర్డింగ్ పాస్‌ల జారీ కోసం ఉపయోగించే నెవిటేర్ వ్యవస్థ సుమారు 45 నిమిషాల పాటు మొరాయించింది. దీంతో ఆన్‌లైన్ ప్రక్రియ మొత్తం స్తంభించిపోయింది.

మాన్యువల్గా చెక్-ఇన్.. భారీగా పెరిగిన రద్దీ
సాంకేతిక సమస్య కారణంగా సిబ్బందికి సంబంధించిన వివరాలను కంప్యూటర్లలో ప్రాసెస్ చేయలేకపోయారు. దీనితో చేసేదేం లేక బోర్డింగ్ పాస్‌లను మాన్యువల్‌గా (చేత్తో రాసి) ఇవ్వడం. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దాదాపు గంట తర్వాత సమస్య పరిష్కారమైనప్పటికీ, జాప్యం వల్ల విమానాలు షెడ్యూల్ ప్రకారం నడవడానికి చాలా సమయం పట్టింది.
Navitaire వ్యవస్థ అంటే ఏంటి?
నెవిటేర్ అనేది విమానయాన సంస్థలకు వెన్నెముక వంటిది. రిజర్వేషన్లు, ప్యాసింజర్ బోర్డింగ్, వెంటరీ మేనేజ్‌మెంట్ వంటి కీలక పనులన్నీ నిర్దేశించబడతాయి. ఇది విఫలమైతే డిజిటల్ నెట్‌వర్క్ మొత్తం ఆగిపోయి, పాత పద్ధతిలో మాన్యువల్ చెకింగ్ చేయాల్సి వస్తుంది.
గత అనుభవాలు.. నేటి సవాళ్లు
గత నవంబర్‌లో కూడా ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక లోపం వల్ల ఏకంగా 800 విమానాలు ఆలస్యమయ్యాయి. 1500 సర్వీసులను నడిపే ఢిల్లీ, 1000 సర్వీసులు నడిపే ముంబయి ఎయిర్‌పోర్టుల్లో చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా అది దేశవ్యాప్తంగా విమాన రాకపోకలపై గొలుసు ప్రభావం (చైన్ రియాక్షన్) చూపుతోంది.

