భారతదేశం
oi-Oneindia సిబ్బంది
<!--
--> <!-- -->గత కొన్ని వారాలుగా భారత్‌లో ఎల్‌పీజీ ధరల పెంపు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మార్చి 7, 2026న కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 పెంచడంతో, విపక్షాలు దీనిని విధానపరమైన వైఫల్యంగా చిత్రీకరిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఈ ధరల పెంపు వెనుక ఉన్న అసలు కారణాలు వేరే ఉన్నాయని స్పష్టమవుతోంది.
పశ్చిమ ఆసియా సంక్షోభం – పెరిగిన గ్లోబల్ రేట్లు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 14.2 కిలోల నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913కి చేరింది.నిజానికి,ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టపోకుండా ఉండాలంటే ఒక సిలిండర్ ధర రూ.

అంతర్జాతీయ ధరలకు.. స్వదేశీ ధరలకు పొంతన లేదు
తన ఎల్‌పీ అవసరాలకు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడతాయి.అంతర్జాతీయంగా ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్'(సౌదీ సీపీ)ప్రాతిపదికన గ్యాస్ ధరలు నిర్ణయించబడతాయి. రెండేళ్లలో (జలై 2023 – నవంబర్ 2025) ధరలు నిర్ణయించబడతాయి. 22 శాతం తగ్గాయి (రూ.1103 నుండి రూ.853కి). అంటే, గ్లోబల్ ధరలు పెరుగుతున్న ప్రభుత్వం వినియోగదారులకు ఊరటనిస్తూ వచ్చింది.
హోర్ముజ్ జలసంధి – రవాణా అడ్డంకులు
భారత్‌కు వచ్చే ఎల్‌పీజీ దిగుమతుల్లో 60 శాతం ‘ హోర్ముజ్ జలసంధి‘(Strait of Hormuz)గుండానే రావాలి.ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ఈ మార్గంలో ట్యాంకర్ల రాకపోకలు నెమ్మదించాయి.దీనివల్ల రవాణా ఖర్చులు,ఇన్సూరెన్స్ ప్రీమియంలు అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు ఎగబాకాయి.ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు,జపాన్,యూరప్ దేశాలకు కూడా పెద్ద సమస్యగా మారింది.
ప్రభుత్వమే భరిస్తున్న అధిక భారం
నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 మధ్య అంతర్జాతీయ ధరల ప్రకారం చూస్తే, దేశీయంగా సిలిండర్ ధర రూ.130 పెరగాలి.కానీ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ధరలను పెంచకుండా నిలిపివేస్తుంది.మార్చిలో చేసిన సవరణలో కూడా కేవలం రూ.60 మాత్రమే పెంచి,మిగిలిన రూ.70ని ప్రభుత్వం భరిస్తోంది. అంటే గ్లోబల్ షాక్‌లో సగానికి పైగా భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుంది.

పక్క దేశాలతో మనమే నయం
మార్చి 2026 నాటికి దక్షిణ ఆసియా దేశాల్లో ఎల్‌పీజీ ధరలను గమనిస్తే భారత్‌లోనే అతి తక్కువ ధరలు ఉన్నాయి.
- భారత్ (ఢిల్లీ): రూ.913
- నేపాల్: రూ.1,207
- శ్రీలంక: రూ.1,241
- పాకిస్తాన్: రూ.1,046
సుమారు 30 కోట్ల మంది వినియోగదారులకు గ్యాస్ అందజేస్తున్న భారత్, ఇరుగుపొరుగు దేశాల కంటే మెరుగైన ధరలకే ఇంధనాన్ని సరఫరా చేస్తోంది.
ఉజ్వల లబ్ధిదారులకు పూర్తి రక్షణ
దేశంలో సుమారు 10.5 కోట్ల పేద కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ కింద రక్షణ కల్పిస్తున్నారు. వీరికి సిలిండర్ పై రూ.300 సబ్సిడీ అందుతోంది. దీనివల్ల తాజా ధరల పెంపు తర్వాత కూడా వీరు కేవలం రూ.613 కే సిలిండర్‌ను పొందుతున్నారు. అంటే దేశంలోని అట్టడుగు వర్గాలపై ఈ ధరల పెంపు ప్రభావం ఏమాత్రం పడలేదు.
తక్కువ ఇంపాక్ట్ – ఎక్కువ చర్చ
ఒక సామాన్య కుటుంబం ఏడాదికి సగటున 4-5 సిలిండర్లు వాడుతుంది. ఈ రూ.60 పెంపును రోజువారీ ఖర్చుగా లెక్కగడితే, ఒక కుటుంబానికి రోజుకు కేవలం 80 పైసలు, అంటే ఒక వ్యక్తికి 20 పైసల భారం మాత్రమే పడుతుంది. ఇది ఒక కప్పు టీ ఖర్చు కంటే చాలా తక్కువ.
1991 నాటి సంక్షోభంతో పోలిక వద్దు
ప్రస్తుత పరిస్థితి 1991 ఆర్థిక సంక్షోభంతో విపక్షాలు పోలుస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. 1991లో మన విదేశీ మారక నిల్వలు కేవలం 1 బిలియన్ డాలర్లు ఉంటే, ఇప్పుడు అవి 700 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అలాగే మన దగ్గర అత్యవసర సమయాల కోసం భారీ ఇంధన నిల్వలు (వ్యూహాత్మక నిల్వలు) సిద్ధంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ,భారత్ తన దేశీయ మార్కెట్‌ను కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని అనుసరిస్తోంది.కేవలం మధ్యప్రాచ్యంపైనే ఆధారపడకుండా అమెరికా వంటి దేశాల నుండి దిగుమతులను పెంచుతూ ఇంధన భద్రతను పటిష్టం చేస్తోంది.కాబట్టి,ఇప్పుడు జరుగుతున్న ధరల సవరణ అనేది కేవలం అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న ఒక నియంత్రిత సర్దుబాటు మాత్రమే తప్ప,అది సంక్షోభం కాదు.