seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 10:55 pm Digital Edition : SEEMA KIRANAM

LPG Cylinder: బ్లాక్ లో 1500 దాటేసిన గ్యాస్ సిలెండర్ ? చాపకింద నీరులా వార్ ఎఫెక్ట్..! | LPG ధర షాక్: ఇరాన్ యుద్ధం యొక్క క్రమమైన ప్రభావం భారతదేశంలో బ్లాక్ మార్కెట్ సిలిండర్‌లను ₹1500 దాటేలా చేసింది

భారతదేశం

-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్ (ఇరాన్)పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, తిరిగి ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియా రక్తసిక్తం అవుతోంది. అదే సమయంలో మధ్య ప్రాచ్యం నుంచి భారత్ కు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. వెరసి భారత్ లో గ్యాస్ కొరత మొదలైంది. ముఖ్యంగా ఇళ్లకు వాడే గ్యాస్ సిలెండర్ల (LPG సిలిండర్)ను పలు రాష్ట్రాల్లో బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్ధితులు వచ్చేశాయి. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. బ్లాక్ రేటు సిలెండర్ కు రూ.1500 దాటిపోతోంది.

దేశంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని కేంద్రం చెబుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా అంతరాయాలు ఏర్పడతాయనే వార్తలతో కొన్ని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలు చోట్ల నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఒక మహిళ.. ₹1,500 చెల్లించి బ్లాక్ మార్కెట్‌లో ఇంటి గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాల్సి వచ్చినట్లు ఇండియా టుడేకు చెప్పింది. గత నాలుగైదు రోజులుగా భయాందోళనతో గ్యాస్ కొనుగోళ్లు పెరిగినట్లు పలు చోట్ల డీలర్లు చెప్తున్నారు.

LPG ధర షాక్ ఇరాన్ యుద్ధం యొక్క క్రమమైన ప్రభావం భారతదేశంలో బ్లాక్ మార్కెట్ సిలిండర్‌లను 1500 దాటిపోయింది

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ప్రస్తుతం 10వ రోజుకు చేరింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా భయాలు మొదలయ్యాయి. గత వారం ప్రభుత్వం ఎల్బీజీ సిలిండర్ల ధరలను పెంచింది. రీఆర్డరింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. మన దేశం తన ఎల్పీజీ డిమాండ్‌లో దాదాపు మూడింట రెండు వంతులను దిగుమతుల ద్వారా తీరుస్తుంది. ఎక్కువగా యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుండి ఎల్బీజో వస్తోంది. ఇవి హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా కావాల్సిందే. ఇరాన్ వార్ నేపథ్యంలో ఈ హార్ముజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోతోంది.

LPG ధర షాక్ ఇరాన్ యుద్ధం యొక్క క్రమమైన ప్రభావం భారతదేశంలో బ్లాక్ మార్కెట్ సిలిండర్‌లను 1500 దాటిపోయింది

ఈ గత ఐదారు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా కోల్‌కతా, పరిసర జిల్లాల్లో ఎల్పీజీ బుకింగ్‌లు 15%-20% పెరిగాయని సూచిస్తున్నాయి. ఈ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌ల మధ్య 15 రోజుల లాక్-ఇన్ పీరియడ్‌ను 21 రోజులకు పెంచాయి. రెండు సిలిండర్లు ఉన్నవారికి, రెండు బుకింగ్‌ల మధ్య లాక్-ఇన్ పీరియడ్‌ను 30 రోజులకు పెంచారు. దీన్నిబట్టి చూస్తే యుద్ధం ప్రభావం మన దేశంపై ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా పరోక్షంగా ఉందని తేలిపోతోంది.

ఆంగ్ల సారాంశం

ఈ కథనం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న అధిక డిమాండ్ మధ్య భారతదేశం యొక్క LPG సరఫరా డైనమిక్స్‌ను పరిశీలిస్తుంది, తగిన స్టాక్‌లు, ధరల పెంపుదల మరియు తాత్కాలిక బుకింగ్ పరిమితుల గురించి ప్రభుత్వ హామీలను పేర్కొంది, అయితే వినియోగదారుల ఆందోళన మరియు ఏకాంత క్యూలు కొనసాగుతున్నాయి.

Source link