seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 9:15 am Digital Edition : SEEMA KIRANAM

Lingashtakam: మంత్రి మనవడి వీడియోకు ప్రభాస్ ఫిదా | కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకంకి పవర్ ఫుల్ వాయిస్ ఇచ్చిన ప్రభాస్, వీడియో వైరల్ అవుతుంది.

తెలంగాణ

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మనుమడు కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకం వీడియోకు రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడు భక్తి ప్రపంచంలోనే కాకుండా అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా తన సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించే ప్రభాస్… ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోకి స్వరం అందించడం ఆయనలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కేవలం రెండున్నరేళ్ల చిన్నారి భక్తిని గమనించి, స్వయంగా ప్రోత్సహించడం ఆయన సరళ స్వభావానికి నిదర్శనంగా అభిమానులు చెబుతున్నారు.

కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకంకి పవర్ ఫుల్ వాయిస్ ఇచ్చిన ప్రభాస్ వీడియో వైరల్ అవుతుంది.

Lingashtakam ముద్దుగా..

చిన్నారి లింగాష్టకం పఠనం ఎంత ముద్దుగా ఉందో, ప్రభాస్ గంభీర స్వరం ఆ వీడియోకు అంతే ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని జోడించింది. ఆ స్వరం వినగానే వీడియోకి ఒక ప్రత్యేకమైన వైభవం వచ్చినట్టు అనిపిస్తోందని నెటిజన్లు కాలుస్తున్నారు.

“ఇలాంటి చిన్నారులే మన సంస్కృతి, సంప్రదాయాల భవిష్యత్. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రభాస్ తెలిపిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ పై ఫ్యాన్స్ ప్రశంసలు..

సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన ప్రభాస్… తన స్వరంతో ఒక చిన్నారి భక్తి ప్రయాణానికి నిలవడం అభిమానుల్లో గర్వాన్ని నింపుతోంది. హీరోగానే కాదు, విలువలను ప్రోత్సహించే వ్యక్తిగా కూడా ప్రభాస్ మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇప్పుడీ వీడియో భక్తి, సెలబ్రిటీ మద్దతు, చిన్నారి అమాయకత్వం.. ఈ మూడింటి కలయికగా వైరల్ ట్రెండ్ అవుతోంది.

ఆంగ్ల సారాంశం

ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకున్న పసిపిల్లలు కొండా మురళీ కృష్ణ పటేల్ పఠించిన లింగాష్టకానికి రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Source link