Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణkova Bun Controversy: స్పందించిన పరిటాల శ్రీరామ్, వలీకి రాజకీయ మద్దతు | మేడారం జాతరలో...

kova Bun Controversy: స్పందించిన పరిటాల శ్రీరామ్, వలీకి రాజకీయ మద్దతు | మేడారం జాతరలో కోవా బన్‌ విక్రేతను టార్గెట్ చేయడాన్ని రాజకీయ నేతలు ఖండించారు.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

మేడారం జాతర సందడి మధ్య ఓ చిన్న కోవా బన్ స్టాల్… కానీ అక్కడ ప్రారంభమైన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కేవలం రూ.10కే కోవా బన్ అమ్ముతున్న వలీ అనే చిరు వ్యాపారిని ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేయడంతో కథ మలుపు తిరిగింది. “ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తావు? ఏదైనా కలిపావా?” అంటూ అనుమానాల వర్షం కురిపించడమే కాకుండా, మతం రంగు పులిమి విమర్శించడం పలువురిని ఆగ్రహానికి గురిచేసింది.

కష్టపడి సంపాదించే ఒక చిన్న వ్యాపారాన్ని ప్రోత్సహించాల్సింది పోయి… వ్యూస్, లైక్స్ కోసం అతడిని బహిరంగంగా ప్రశ్నించడం, అతని గౌరవాన్ని దెబ్బతీయడం సరైనదా? అనే ప్రశ్న నెటిజన్లను కదిలించింది. ఈ వ్యాఖ్యలు కేవలం వాలిని మాత్రమే కాదు, తక్కువ లాభంతో నిజాయితీగా జీవనం సాగించే శ్రమజీవులందరినీ అవమానించడమేనని సోషల్ మీడియాలో వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

మేడారం జాతరలో కోవా బన్‌ విక్రేతను టార్గెట్ చేయడాన్ని రాజకీయ నేతలు ఖండించారు.

ఇదిలా ఉండగా, రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. “ఆకలికి కులం ఉండదు… ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ. ఒక కోవా బన్ అమ్ముకునే పేద వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్ వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం తగదు. పేదవారి పక్షాన నిలబడాలి గానీ గొంతు నొక్కడం కాదు” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో వలీకి లభిస్తున్నత్వం ఇంకా బతికే ఉందని మానవునికి మద్దతునిస్తుంది.

అదే సమయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా వలీకి అండగా నిలిచారు. తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించడానికి ప్రయత్నాన్ని అభినందిస్తూ, మతం, అనుమానాల పేరుతో చిన్న వ్యాపారులను వేధించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.

మొత్తానికి, మేడారం జాతరలో ప్రారంభమైన ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. వివక్షను తిప్పికొడుతూ, కులమతాలకు అతీతంగా వాలికి అండగా నిలుస్తున్న నెటిజన్లు… “ఆకలి ముందు మనం అందరం ఒక్కటే” అనే సందేశాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular