అంతర్జాతీయ
ఓయ్-కన్నయ్య
<!--
--> <!-- -->టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమ ఆసియా ముఖచిత్రాన్ని మార్చేస్తూ, ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక అయాతొల్లా అలీ ఖమేనీని-ఇజ్రాయెల్ సైనికులు మట్టుబెట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే, సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇదే ఖమేనీని చంపే అవకాశం ఇజ్రాయెల్‌కు వచ్చిందా, అప్పుడు వద్దని వారించిన డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఎందుకు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రతిపాదన ప్రత్యేక కథనం.
అప్పుడు ‘వద్దు’.. ఇప్పుడు ముగింపు
2025 జూన్‌లో ఇరాన్ అణువణువూ అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది.ఖమేనీని అంతం చేసే ప్లాన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సిద్ధం చేశారు. కానీ,అప్పుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.అయితే,ఫిబ్రవరి 28,2026న జరిగిన దాడిలో మాత్రం ఖమేనీతో పాటు ఆయన భార్య,కుమార్తె,అల్లుడు,మనవరాలు,రక్షణ మంత్రి సహా కీలక అధికారులందరినీ ఏరిపారేశారు. ఈ మార్పు వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

1. ట్రంప్‌పై హత్యాప్రయత్నాలు – వ్యక్తిగత కక్ష?
ఖమేనీచంపిన రెండు రోజుల ట్రంప్ ఒక సంచలనం బయట పెట్టారు.ఖమేనీ తనను రెండుసార్లు చంపడానికి ప్రయత్నించారు.2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ చెవికి తన్న బుల్లెట్ గాయం,సెప్టెంబర్‌లో గోల్ఫ్ కోర్సులో జరిగిన దాడి వెనుక ఇరాన్ ప్రమేయం తర్వాత అమెరికా నిఘా సంస్థలు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి.
2. ‘ముందస్తు’ వ్యూహం – తప్పనిసరి దాడి?
అమెరికా నిఘా వర్గాల ప్రకారం..ఇరాన్ తన క్షిపణులతో అమెరికా స్థావరాలపై భారీ దాడికి సిద్ధమవుతోంది.”మేము దెబ్బతినే వరకు చూస్తూ కూర్చోలేము. ఇరాన్ క్షిపణులను ప్రయోగించే ముందే వాటిని ధ్వంసం చేయడం మాకు రక్షణ కవచం లాంటిది” అని అమెరికా సూచించింది.
3. ఇరాన్ చరిత్రలో అత్యంత బలహీనమైన సమయం
యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ప్రకారం..ఇరాన్ ఇప్పుడు చరిత్రలోనే అత్యంత బలహీన స్థితిలో ఉంది.మతపరమైన ఉన్మాదులు అణ్వాయుధాలు పొందితే ప్రపంచానికి ముప్పు ఉందని తెలిసి… వారి క్షిపణి వ్యవస్థను,నౌకాదళాన్ని,డ్రోన్ల తయారీని దెబ్బకొట్టడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ భావించినట్లు రూబియో స్పష్టం చేశారు.
ట్రంప్ స్పందన:ఇది న్యాయం
ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరుడైన వ్యక్తిగా అభివర్ణించారు, ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాకుండా ఇరాన్ చేతిలో దెబ్బతిన్న అమెరికన్లకు దక్కిన న్యాయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇరాన్ తన సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకగా దుబాయ్,అబుదాబి,ఖతార్,బహ్రెయిన్ వంటి ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది.చర్చలకు సమయం మించిపోయిందని, ఇకపై జరిగే యుద్ధమేనని ట్రంప్ హెచ్చరించడంతో మధ్యప్రాచ్యంలో టెన్షన్ పతాక స్థాయికి చేరుకుంది.
ఆంగ్ల సారాంశం
ఇరాన్ ఇజ్రాయెల్ US యుద్ధం – డోనాల్డ్ ట్రంప్ గతంలో ఇదే విధమైన చర్యను నిరోధించిన తర్వాత అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”ని ఆమోదించినట్లు నివేదించబడింది. ఈ నిర్ణయం వెనుక బెంజమిన్ నెతన్యాహు ప్రమేయం ఉన్న హత్యా పథకం వాదనలు, క్షిపణి బెదిరింపులు మరియు వ్యూహాత్మక సమయాలను విశ్లేషకులు పేర్కొన్నారు.