అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు అట్టుడుకిపోతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు క్రమంగా ఉద్ధృతం అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతున్నాయి. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సాయిప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.
అయితే యుద్ధం కారణంగా రద్దు అయిన విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. దుబాయ్ లో పాక్షికంగా తిరిగి ప్రారంభించారు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. గత కొన్ని రోజులుగా విమానాల రద్దు, జాప్యాల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణీకులను ఈ విమానం ద్వారా తీసుకొచ్చారు.

ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం దుబాయ్ నుంచి ఓ స్పెషల్ ఫ్లైట్ ను ఆపరేటింగ్ చేస్తోంది. దుబాయ్ లో విమానాలు రద్దు అయిన తర్వాత ముందుగా అక్కడి నుంచి భారత్ బయల్దేరుతున్న విమానం ఇదే.. అయితే ఇందులో ప్రయాణికులు లేరు. ఉన్నవాళ్లంతా పైలట్లే.. యుద్ధం కారణంగా దుబాయ్ లో చిక్కుకుపోయిన మొత్తం 149 పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్స్ భారత్ కు పయనమయ్యారు. దుబాయ్, జెడ్డాలో చిక్కుకున్న పైలట్లను ప్రస్తుతం భారత్ కు తరలిస్తోంది ఇండియన్ ఎయిర్ లైన్స్.
📌رحلة غير معتادة
🔸الخطوط الهندية تشغل رحلة خاصة اليوم من دبي كأول رحلة منذ اغلاق الاجواء
🔹LANKAL 149 జీయర్ వమ్జీఫ్ జూ కానో అబ్లాక్యిన్ బద్బి వజ్జాద్ మెన్హమ్ మత్వాస్డ్ బ్జెడ్
🔸బదత్ అల్హిందీస్ వాందీక్వూ తస్సీల్ రహలత్ అఅదడస్ లాల్సాస్రాత్ వాలాషాక్మ్ వాఅద్థాయా లాల్హన్ద్ బౌద్ ఫుటాక్ అల్మాష్
100 జయార్ బర్హల్స్😀 pic.twitter.com/5HWIunngW9
— راكان العبيد (@rakan_b777) మార్చి 3, 2026
ఈ మేరకు ఇండిగో, ఎయిర్ ఇండియా కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన పైలట్లు, క్రూ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తున్నారు. ఈ వివరాలకు సంబంధించిన పోస్టును ఓ పైలట్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

