వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల ధైర్యం మాత్రం తగ్గలేదు. AMFI విడుదల చేసిన జనవరి 2026 నాటికి, భారతదేశంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచనలు ఎంత వేగంగా మారుతున్నాయో స్పష్టంగా చూపబడింది. ఈక్విటీ ఫండ్లలోకి వచ్చే నిధులు గత నెలలో కొంత తగ్గినా, మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల విలువ రూ.81.01 లక్షల కోట్లకు చేరడం. అంటే మార్కెట్ భయాల మధ్య కూడా ఇన్వెస్టర్లు దీర్ఘకాల దృష్టితో ముందుకు సాగుతున్నారన్న మాట.
జనవరిలో ఈక్విటీ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడులు సుమారు 14 శాతం తగ్గి రూ.24,029 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లలో ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే రిస్క్ తక్కువగా ఉండే లార్జ్ క్యాప్ ఫండ్స్‌పై మాత్రం ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది.

మరోవైపు మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్ల చూపు బంగారం వైపు మళ్లింది. గోల్డ్ ఇటిఎఫ్‌లలోకి జనవరిలో వచ్చిన పెట్టుబడులు రూ.24,040 కోట్లకు చేరాయి, గత నెలలో రెండింతలకు పైగా పెరగడం విశేషం. ఇది ‘సేఫ్ హావెన్’ వ్యూహానికి ఇన్వెస్టర్లు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపిస్తోంది.
గోల్డ్ ఇటిఎఫ్ జనవరిలో..
డెట్ ఫండ్స్ జనవరిలో ఆశ్చర్యకరంగా రికవరీ చూపించాయి. డిసెంబర్‌లో భారీ విత్డ్రాయల్స్ ఎదుర్కొంటున్న ఈ విభాగం, జనవరిలో ఏకంగా రూ.74,827 కోట్ల ఇన్‌ఫ్లోలను నమోదు చేసింది. నివేదికలు, సంస్థాగత ఇన్వెస్టర్లు తమ అదనపు నిధులను తిరిగి డెట్ ఫండ్స్‌లో పెట్టడం దీనికి ప్రధాన కారణం.
హైబ్రిడ్ ఫండ్స్ కూడా రూ.17,356 కోట్ల పెట్టుబడులతో ఆకర్షణీయంగా మారాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ హాట్ ఫేవరెట్‌గా కొనసాగుతుండగా, SIPల సంఖ్య నెలనెలా పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, నేటి ఇన్వెస్టర్ ఒక్క మార్కెట్‌పై ఆధారపడకుండా బంగారం, డెట్, మల్టీ అసెట్ ఫండ్స్ ద్వారా బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకుంటూ, లాభాలతో పాటు భద్రతకూ సమాన ప్రాధాన్యత ఇస్తున్నాడు.

