seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 6:21 pm Digital Edition : SEEMA KIRANAM

Forbes: ఇంత కరవులోనూ.. ప్రపంచ కుబేరులు వీళ్లే.. | ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా తాజాగా: ఎలోన్ మస్క్ భారీ నెట్ వర్త్ పెరుగుదలతో నంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందాడు

అంతర్జాతీయ

-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. నిరుద్యోగిత, పేదరికం పెరిగిపోతున్నాయి. ఈ ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా ప్రపంచ కుబేరుల జాబితా ప్రకారం.. వ్యాపారవేత్త, టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక ఈ సంవత్సరం ఫోర్బ్స్ వార్షిక బిలియనీర్ల జాబితాలో ఏకంగా 3,428 మంది పేర్లు ఉన్నాయి. గత ఏడాదితో 400 మంది పెరుగడం విశేషం.

ఈ ఏడాది బిలియనీర్ల మొత్తం సంపద $20.1 ట్రిలియన్లుగా నమోదైంది. గత సంవత్సరం కంటే $4 ట్రిలియన్లు ఎక్కువ. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ మాస్క్ ఈ జాబితాలో తిరిగి అగ్రస్థానంలో నిలిచారు. 2025 నుండి ఆయన సంపద $497 బిలియన్లు పెరిగి, దాదాపు రెట్టింపై, $839 బిలియన్ల రికార్డు స్థాయికి చేరింది. మాస్క్.. గూగుల్ సహ వ్యవస్థాపకులైన లారీ పేజ్ (రెండో స్థానం), సెర్గీ బ్రిన్ (మూడో స్థానం) ల సంపదకంటే మూడు రెట్లు అధికంగా ఉన్నారు.

ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్ నిలిచారు, సెర్గీ బ్రిన్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. అలాగే ఫేస్ బుక్ సృష్టికర్త మార్క్ జుకర్ బర్గ్ ఐదో స్థానంలో, ఒరాకిల్ అధిపతి లారీ ఎల్లిసన్ ఆరో స్థానంలో నిలిచారు. ఇక ఏడో స్థానంలో LVMH కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం, ఎనిమిదో స్థానంలో సెమికండక్టర్స్ రంగం నుండి జెన్సెన్ హువాంగ్ నిలిచారు. తొమ్మిదో కోసం బెర్క్‌షైర్ హాత్వే వారెన్ బఫెట్ దక్కించుకున్నారు.

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా తాజాగా ఎలోన్ మస్క్ భారీ నెట్ వర్త్ పెరుగుదలతో నంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందింది

అలాగే భారత్ నుంచి ముఖేష్ అంబానీ 21వ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 31వ స్థానంలో నిలిచారు. క్రిప్టోకరెన్సీ రంగం నుండి ఇటలీకి చెందిన జియాన్‌కార్లో దేవాసిని 22వ స్థానం, టిక్ టాక్ సృష్టికర్త చైనాకు చెందిన ఝాంగ్ యిమింగ్ 26వ స్థానంలో ఉన్నారు.

ఆంగ్ల సారాంశం

ఫోర్బ్స్ 2026 మొత్తం సంపద 20.1 ట్రిలియన్ డాలర్లతో 3,428 బిలియనీర్ల ర్యాంక్‌లో ఉంది. ఎలోన్ మస్క్ ముందున్నారు, లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ తర్వాత, సాంకేతికత మరియు ఇతర రంగాలలో స్థిరమైన వృద్ధిని హైలైట్ చేశారు.

Source link