వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
దాచుకున్న డబ్బుకు భరోసాతో పాటు మంచి లాభం రావాలని కోరుకునే మధ్యతరగతి ఇన్వెస్టర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) ఎప్పుడూ హాట్ ఫేవరెట్. అయితే, ప్రస్తుత మార్కెట్‌లో బ్యాంకుల మధ్య నడుస్తున్న వడ్డీ రేట్ల పోటీ పెట్టుబడిదారులకు వరంగా మారింది.
ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రైవేట్, రంగ ప్రభుత్వ బ్యాంకుల కంటే భారీ వడ్డీని ఆఫర్ చేస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. 1 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో మీరు చేసే చిన్న పొదుపు కూడా సరైన బ్యాంక్‌ను కారణంగా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది.
అగ్రస్థానంలో..
ప్రస్తుతం ఎఫ్డీలపై అత్యధిక రాబడిని ఆఫర్ జాబితాలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉన్నాయి. పైసా బజార్ నివేదిక ప్రకారం, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏకంగా 8.25 శాతం వడ్డీతో టాప్‌లో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో ESAF (8.00%), శివాలిక్ (7.80%), మరియు ఉత్కర్ష్ (7.50%) బ్యాంకులు ఉన్నాయి. కస్టమర్ బేస్‌ను పెంచుకునే వ్యూహంతో ఈ బ్యాంకులు ఎక్కువగా 8 శాతం పైచిలుకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ బ్యాంకులు
మీకు భద్రతతో పాటు మెరుగైన రాబడి కావాలంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు మంచి ఎంపికగా కనిపిస్తున్నాయి. ఇందులో SBM బ్యాంక్ ఇండియా అత్యధికంగా 7.85 శాతం వడ్డీని అందిస్తోంది, IDFC ఫస్ట్ బ్యాంక్ (7.50%), RBL బ్యాంక్ (7.20%) కూడా గట్టి పోటీనిస్తున్నాయి. ఇక నమ్మకానికి మారుపేరుగా నిలిచే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. PNB, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ లు నమోదైన 6.60 శాతం వడ్డీని ఇస్తున్నాయి. దేశీ దిగ్గజం SBI 6.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
విదేశీ బ్యాంకుల పరిస్థితి ఏంటి?
గ్లోబల్ బ్యాంకింగ్ సేవలు కోరుకునే వారి కోసం విదేశీ బ్యాంకులు కూడా వివిధ రేట్లను అందజేస్తాయి. డ్యూయిష్ బ్యాంక్ 7.00 శాతంతో ఆకర్షణీయంగా ఉండగా, స్టాండర్డ్ చార్టర్డ్ 6.60 శాతం, HSBC 5.50 శాతం వడ్డీని ఇస్తున్నాయి. మీ పోర్ట్‌ఫోలియోను ఇవి వైవిధ్యపరచాలనుకునే వారికి ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి.
పెట్టుబడి పెట్టే ముందు కేవలం వడ్డీ రేటునే కాకుండా, ఆయా బ్యాంకుల నిబంధనలు, ముందస్తు విత్డ్రాయల్ చార్జీలు మరియు డిపాజిట్ ఇన్సూరెన్స్ (DICGC) పరిమితులను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తెలివైన ఎంపికే మీ సంపాదనకు అసలైన రక్షణ.

