seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 6:10 pm Digital Edition : SEEMA KIRANAM

Emotional Video: ” ప్లీజ్.. త్వరగా ఇక్కడినుంచి తీసుకెళ్లిపోండి” | ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు సహాయం కోసం వేడుకుంటున్నారు: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం మధ్య ఇప్పుడు తరలింపును వేగవంతం చేయండి

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో కనిపిస్తున్నారు. ఇరాన్‌లోని పలు పట్టాణాలపై ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు.. భారత ప్రభుత్వం తమను వెంటనే స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు విద్యార్థులు.. ఎమోషనల్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తమను తక్షణమే స్వదేశానికి తరలించాలని ప్రధాని మోదీని కోరుకుంటున్నారు.

ఓవైపు వైమానిక దాడులు, భయం తదుపరి షెడ్యూల్ కారణంగా ఆందోళనలో విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. భయంతో బతుకుతున్నామని.. ఇక్కడి డైలీ లైఫ్ పూర్తిగా మారిపోయిందని చాలా మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఓ భారతీయ విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఎమోషనల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

“అందరికీ నమస్కారం.. నేను భారతీయ విద్యార్థిని.. నేను ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉంటున్నాను. ఈ వాతావరణం ప్రస్తుతం చాలా భయాందోళనగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి” అని ఆ విద్యార్థిని తెలిపారు.

ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తరలింపును వేగవంతం చేయడానికి సహాయం కోసం విజ్ఞప్తి చేశారు

విద్యార్థిని మాట్లాడుతూ..” భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న తక్షణ చర్యలకు కృతజ్ఞతలు. కానీ ఇలాంటి సమయంలో ఎంత త్వరగా విద్యార్థులను స్వదేశానికి తరలించాలన్నదే కీలకంగా మారుతుంది. వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి దాడులు చేపట్టారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తక్షణమే గగనతలాన్ని మూసేసింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టారు.

Source link