అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
<!--
--> <!-- -->బెంజమిన్ నెతన్యాహు: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య గత మూడు వారాలుగా భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొన్ని రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న ఇరాన్ సోషల్ మీడియా వర్గాలు.. ఇరాన్ జరిపిన దాడుల్లో బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశాయి. యుద్ధం 17వ రోజుకు చేరినా ప్రధాని నెతన్యాహు బయటకు రాగా ఇజ్రాయెల్ ప్రజల్లోనూ, అంతర్జాతీయ వర్గాల్లోనూ ఆయన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాఫీ కోసం చనిపోతా.. నెతన్యాహు ఫన్నీ కౌంటర్
ఈ పుకార్లను పటాపంచలు చేస్తూ బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఓ వీడియోను విడుదల చేశాడు. జెరూసలేం శివార్లలోని ఓ కేఫ్‌లో కాఫీ తాగుతూ ఆయన కనిపించాడు. తన మరణవార్తలపై స్పందిస్తూ హీబ్రూ స్లాంగ్‌ను ఉపయోగించి “నేను చనిపోలేదు, కానీ కాఫీ అంటే నాకు ప్రాణం (కాఫీ కోసం చనిపోతా)” అంటూ చమత్కరించారు. తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా, తాను ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నానని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి నేతన్యాహు చాటిచెప్పారు.

ఆరో వేలి వివాదానికి తెర
నెతన్యాహు చనిపోయారని నమ్మడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన ఏఐ వీడియో విడుదల చేసిందని.. ఆ వీడియోలో ఆయన చేతికి ఆరు వేలు ఉన్నాయంటూ నెటిజన్లు స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. ఈ ఆరోపణపై కూడా నెతన్యాహు తన వీడియోలో నేరుగా స్పందించారు. కెమెరా ముందు తన రెండు చేతులను పైకెత్తి వేళ్లను స్పష్టంగా చూపిస్తూ.. “నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగోండి లెక్కించుకోండి” అని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ వీడియో అంటూ వస్తున్న వార్తలకు నెతన్యాహు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
ప్రజలకు నెతన్యాహు సందేశం
కేవలం తన ఆరోగ్యంపైనే కాకుండా, యుద్ధంపై కూడా నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేయడం. “బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి, కానీ సురక్షితంగా ఉండండి. మీ మద్దతు నాకు, సైన్యానికి, మొసాద్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మేము ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు. గత నెలలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతున్న నేపథ్యంలో నెతన్యాహు తాజా వీడియో ఇజ్రాయెల్ పౌరుల్లో ధైర్యాన్ని నింపింది.
అంతుచిక్కని యుద్ధ మేఘాలు
ఈ వీడియోతో బెంజమిన్ నెతన్యాహు మరణంపై వస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది. అయితే ఇరాన్ మాత్రం పంతం వీడకుండా అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన ప్రపంచంలో దేశంలో వ్యక్తమవుతోంది. ఓవైపు ఏఐ పుకార్లు, మరోవైపు క్షిపణి దాడుల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలోకి రావడం విశేషం.
ఆంగ్ల సారాంశం
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక కేఫ్ నుండి వీడియోను విడుదల చేయడం ద్వారా వైరల్ డెత్ రూమర్‌లను తోసిపుచ్చారు, కాఫీ గురించి చమత్కరించారు మరియు AI వాదనలను ఎదుర్కోవడానికి తన వేళ్లను చూపారు.