వ్యాపారం
-లింగారెడ్డి గజ్జల
ఖాతాదారులకు భారీ షాక్ ఇస్తూ, దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ కొనుగోలుకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, పెరిగిపోతున్న సైబర్ మోసాల నుండి కస్టమర్లను రక్షించడమే లక్ష్యంగా, ఏటీఎం (ATM) నగదు విత్ డ్రా పరిమితులను భారీగా తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఖాతాదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, సైబర్ మోసాల కస్టమర్లను రక్షించడమే లక్ష్యంగా, పీఎన్‌బీ తన పాపులర్ డెబిట్ కార్డ్ వేరియంట్‌లపై ఏటీఎం (ATM) నగదు ఉపసంహరణ పరిమితులను భారీగా తగ్గించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. అత్యవసర సమయంలో ఎక్కువ నగదు విత్డ్రా చేసుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయం కొంత ఇబ్బందికరంగా మారనుంది.

సగం తగ్గిన విత్డ్రా పరిమితి – ఏయే కార్డులకంటే?
బ్యాంక్ తీసుకున్న తాజా ప్రకారం, అత్యధికంగా వాడే పలు ప్లాటినం మరియు గోల్డ్ కార్డుల పరిమితిని ఏకంగా సగానికి తగ్గించారు. ఇప్పటివరకు రూ.1,00,000 వరకు నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్న రూపే ఎన్‌సీ ప్లాటినం, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, మరియు వీసా గోల్డ్ వంటి కార్డుల పరిమితిని రోజుకు రూ.50,000కి పరిమితం చేశారు. అంటే ఏప్రిల్ 1 తర్వాత ఈ కార్డుల ద్వారా ఒకే రోజు లక్ష రూపాయలు తీయడం సాధ్యం కాదు.
ప్రీమియం కార్డులపై కూడా వేటు..
కేవలం కార్డు సాధారణలే కాకుండా, సెలెక్ట్ మరియు సిగ్నేచర్ వంటి ప్రీమియం డెబిట్ కార్డుల పైనా బ్యాంక్ ఆంక్షలు విధించబడ్డాయి. రూపే సెలెక్ట్, పీఎన్‌బీ రూపే సెలెక్ట్ నియో, వీసా సిగ్నేచర్ మరియు మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్ వంటి హై-ఎండ్ కార్డుల రోజువారీ విత్‌డ్రా లిమిట్‌ను రూ.1,50,000 నుండి రూ.75,000కి తగ్గించారు. అయితే, పాయింట్ ఆఫ్ సెల్ (POS), ఈ-కామర్స్ (ఆన్‌లైన్ షాపింగ్), మరియు కాంటాక్ట్‌లెస్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కొంత ఉపశమనం కలిగించే అంశం.
ATM కార్డ్ లిమిట్ సెట్ చేసుకోవడం ఎలా?
సవరించిన ఈ కొత్త పరిమితులకు లోబడి కస్టమర్‌లు తమకు కావాల్సిన లిమిట్‌ను స్వయంగా సెట్ చేసుకోవచ్చు. పీఎన్‌బీ వన్ (PNB One) మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ‘వాల్యూ యాడెడ్ సర్వీసెస్’లోకి వెళ్లి ‘డెబిట్ కార్డ్ పర్సనలైజేషన్’ ఆప్షన్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. మొబైల్ యాప్‌లో అయితే ‘సర్వీసెస్’ సెక్షన్‌లో డెబిట్ కార్డ్ లిమిట్ అప్‌డేట్ చేసే వెసులుబాటు ఉంది. ఏప్రిల్ 1 లోపే కస్టమర్లు ఈ మార్పులను గమనించి, తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని బ్యాంక్ సూచిస్తోంది.

