ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఏపీలోని స్కూళ్లపై (పాఠశాలలు) ఇవాళ శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యామంత్రి నారా లోకేష్ కీలక విషయాలు. ముఖ్యంగా స్కూల్స్ కు ఇస్తున్న రేటింగ్ ఆధారంగా లోకేష్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో స్కూల్స్ తాజా పరిస్థితిపై చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ పనితీరు వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని లోకేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచామని లోకేష్ ప్రకటించారు.
2020 నుంచి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా మనబడి నాడు- నేడు, మనబడి -మన భవిష్యత్ పథకాల కింద ఖర్చు చేసిన నిధుల వివరాలు, ఆయా పథకాల కింద పూర్తిగా అభివృద్ధి, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పాఠశాలల వివరాలపై వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.7,500 కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ చెప్పానని, 18 స్టార్ రేటింగ్ ఇచ్చామని, స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత సుమారు 40 శాతం పాఠశాలలు 2స్టార్ కంటే తక్కువగా ఉన్నాయని లోకేష్ గుర్తించారు. వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమనగా, నేను చిత్తూరు పర్యాటకు వెళ్లినప్పుడు కొన్నింటిలో లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవని, పేయింటింగ్, బేసిక్ బెంచెస్, ఫర్నిచర్స్ లేవని, ముందు లీక్ ప్రూవ్ బిల్డింగ్స్, బెంచ్ లు, పెయింటింగ్, ఫర్నీచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. బిల్లులు చెలిస్తే ఇబ్బంది కాదన్నారు.