seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 6:12 am Digital Edition : SEEMA KIRANAM

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: సర్వజన హితాయ, సర్వజన సుఖాయ | AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: భారత్ మండపం ఈవెంట్‌లో భారతదేశ సాంకేతిక వృద్ధిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైలైట్ చేశారు

భారతదేశం

-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించనున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న తొలి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సదస్సు భారత్‌లో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమిట్‌కు ప్రపంచ దేశాలు పాల్గొనాలని ఆయన ఆహ్వానం పలికారు.

”సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సు, కృత్రిమ మేధస్సును ప్రపంచ సంక్షేమానికి ఉపయోగించుకోవాలంటే ఉమ్మడి సంకల్పానికి ప్రతీక అని ప్రధాని చెప్పారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన పాత్రను మరింత విస్తరించేందుకు ఇది కీలక వేదిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ మండపం ఈవెంట్‌లో భారతదేశ సాంకేతిక వృద్ధిని హైలైట్ చేశారు

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ప్రపంచానికి చాటి చెప్పాలి..

భారత యువత ప్రతిభ, దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న ఈ సమితుల ప్రపంచానికి చాటి చెప్పనుందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో ఏఐఐ పాత్ర పోషిస్తోందని, డిజిటల్ ప్రజా సౌకర్యాల విస్తరణలో భారత్ ముందంజలో ఉంది.

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: 45 దేశాల నుంచి ప్రతినిధులు

ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తమ దేశాలు ఏఐ అజెండాలను నిర్వహించుకోవడం, గ్లోబల్ సహకార అవకాశాలను అన్వేషించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ, అత్యాధునిక పరిశోధనలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సమిట్ ప్రత్యేకతగా నిలవనుంది.

డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు శక్తిగా మారుతున్న వేళ, భారత్ ఈ రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు ముందడుగు వేస్తోందని ఈ సదస్సు స్పష్టం చేస్తోంది.

ఆంగ్ల సారాంశం

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఆహ్వానించారు. సమ్మిట్ భారతదేశం యొక్క AI వృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను హైలైట్ చేస్తుంది.

Source link