భారతదేశం
-లింగారెడ్డి గజ్జల
రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించనున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న తొలి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సదస్సు భారత్‌లో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమిట్‌కు ప్రపంచ దేశాలు పాల్గొనాలని ఆయన ఆహ్వానం పలికారు.
”సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సు, కృత్రిమ మేధస్సును ప్రపంచ సంక్షేమానికి ఉపయోగించుకోవాలంటే ఉమ్మడి సంకల్పానికి ప్రతీక అని ప్రధాని చెప్పారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన పాత్రను మరింత విస్తరించేందుకు ఇది కీలక వేదిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ప్రపంచానికి చాటి చెప్పాలి..
భారత యువత ప్రతిభ, దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న ఈ సమితుల ప్రపంచానికి చాటి చెప్పనుందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో ఏఐఐ పాత్ర పోషిస్తోందని, డిజిటల్ ప్రజా సౌకర్యాల విస్తరణలో భారత్ ముందంజలో ఉంది.
AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: 45 దేశాల నుంచి ప్రతినిధులు
ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తమ దేశాలు ఏఐ అజెండాలను నిర్వహించుకోవడం, గ్లోబల్ సహకార అవకాశాలను అన్వేషించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ, అత్యాధునిక పరిశోధనలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సమిట్ ప్రత్యేకతగా నిలవనుంది.
డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు శక్తిగా మారుతున్న వేళ, భారత్ ఈ రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు ముందడుగు వేస్తోందని ఈ సదస్సు స్పష్టం చేస్తోంది.
AI గురించి చర్చించడానికి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం!
ఈ రోజు నుండి, భారతదేశం ఢిల్లీలోని భారత్ మండపంలో AI ఇంపాక్ట్ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచ నాయకులు, పరిశ్రమల కెప్టెన్లు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పరిశోధకులు మరియు సాంకేతిక ఔత్సాహికులను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ది…
– నరేంద్ర మోదీ (@narendramodi) ఫిబ్రవరి 16, 2026

