Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణచుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. !! | ఈరోజు బంగారం మరియు వెండి ధరలు: ఫిబ్రవరి...

చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. !! | ఈరోజు బంగారం మరియు వెండి ధరలు: ఫిబ్రవరి 27న 10గ్రా బంగారం రూ.160100 మరియు వెండి కిలో రూ.274794

📰 Generate e-Paper Clip


వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడం, స్పాట్ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.34 శాతం పెరిగింది. 1,60,100 వద్ద స్థిరపడింది. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. 2.55 శాతం మేర పెరిగి కిలోకు 2,74,794 రూపాయలకు చేరుకుంది.

ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,110గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,47,590కి లభిస్తోంది. గత నెలలో బంగారం, వెండి ధరల రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,80,000కు మించి ఆల్‌టైమ్ స్థాయికి చేరగా, వెండి ధర కిలోకు 4,20,000తో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి.

బంగారం మరియు వెండి ధరలు ఈరోజు బంగారం 10గ్రాకు రూ.160100 మరియు ఫిబ్రవరి 27న కిలో వెండి రూ.274794

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,48,340 కాగా, 24 క్యారెట్లు రూ. 1,61,820. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,48,240, 24 క్యారెట్లు రూ. 1,61,720. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,590గా ఉంది. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,110కి చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు – రూ. 14,900, 18 క్యారెట్లు – రూ. 12,750

ముంబై..

24 క్యారెట్లు – రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు – రూ. 12,118

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు – రూ. 12,118

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు – రూ. 12,118

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు – రూ. 12,118

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 16,157, 22 క్యారెట్లు- రూ. 14,810, 18 క్యారెట్లు – రూ. 12,118



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular