Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణభారత్ ను వదల బొమ్మాలీ అంటున్న డోనాల్డ్ ట్రంప్.. మరో భారీ షాక్! | భారతదేశం...

భారత్ ను వదల బొమ్మాలీ అంటున్న డోనాల్డ్ ట్రంప్.. మరో భారీ షాక్! | భారతదేశం నుండి అమెరికాకు సోలార్ దిగుమతులపై భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి షాక్ ఇచ్చారు.

📰 Generate e-Paper Clip


భారతదేశం

-డాక్టర్ వీణా శ్రీనివాస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ తగిలినా సరే ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా భారత్ ను అసలే విడిచిపెట్టటం లేదు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత సోలార్ రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నా, ‘మధ్యంతర వాణిజ్య ఒప్పందం’ ఇంకా అమలు కాకముందే ఈ ప్రకటన వెలువడింది.

సోలార్ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం

భారత్ నుంచి దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ఏకంగా 126 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ఎగుమతిదారులకు ఊహించని షాక్ అంటే చెప్పాలి. ఇప్పటికే అమెరికా విధిస్తున్న టారిఫ్ లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న వేళ ఊహించని నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటున్నారు.

బలమైన కారణాలను చెప్పిన అమెరికా వాణిజ్య శాఖ

తాజాగా విధించిన ఈ భారీ టారిఫ్‌లకు అమెరికా వాణిజ్య శాఖ బలమైన కారణాలను చూపింది. భారత ప్రభుత్వం దేశీయ సోలార్ తయారీదారులకు అమెరికా ఇచ్చే ‘ఫారిన్ సబ్సిడీలు’ అన్యాయమైనవని, దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత ప్యానెళ్లు తక్కువ ధరకు లభిస్తున్నాయని వాణిజ్య శాఖ ఆరోపించింది. ఇది ‘డంపింగ్’గా గుర్తింపు, స్థానిక కంపెనీలను రక్షించుకోవడమే తమ ప్రాధాన్యతని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

భారత్ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం.. సోలార్ కంపెనీల షేర్లు పతనం

కేవలం భారత్‌పైన మాత్రమే కాకుండా, ఇండోనేసియాపై 143%, లావోస్‌పై 81% ఇదే తరహా సుంకాలు విధించడం. ఈ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌పై తక్షణమే ప్రభావం చూపింది. అమెరికాకు ఎగుమతులు చేసే వారి ఎనర్జీలు 11%, సోలెక్స్ ఎనర్జీ 8%, ప్రీమియర్ ఎనర్జీలు 6% వంటి ప్రముఖ సోలార్ కంపెనీల షేర్లు నిన్న భారీగా పతనమయ్యాయి.

సోలార్ రంగంలో దూసుకుపోతున్న భారత్ కు షాక్

సోలార్ రంగంలో దూసుకుపోతున్న భారత్‌కు, తాజాగా సోలార్ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా విధించిన సుంకం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ట్రంప్ భారత్ కు పదే పదే ఇస్తున్న షాకులు టారిఫ్ ల విషయంలో ఆందోళనలకు కారణం అవుతుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular