Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ - ముహూర్తం, రూట్, షెడ్యూల్..!! | మార్చి 1వ...

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ – ముహూర్తం, రూట్, షెడ్యూల్..!! | మార్చి 1వ తేదీన మదురై నుంచి నాలుగు నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్తగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కేటాయించారు. రైల్వేలో వందేభారత్ నుంచి ప్రస్తుతం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వరకు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కుతోంది. తమిళనాడు కేంద్రంగా మార్చి 1 న ప్రధాని మోదీ ఒకే సారి నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపే రైలు రూట్ – షెడ్యూల్ ను అధికారులు ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. మార్చి 1వ తేదీన తమిళనాడులోని మధురై వేదికగా మోదీ నాలుగు కొత్త రైలు సర్వీసులను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. మంగళూరు సెంట్రల్-రామేశ్వరం-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, తాంబరం- మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్-ధనాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఒకే ముహూర్తాన ప్రధాని మోదీ ప్రారంభించారు. అదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొత్తగా అభివృద్ది చేసిన 8 స్టేషన్లను మోదీ మార్చి 1వ తేదీన మధురై నుంచి జాతికి అంకితం చేయనున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఒకే సారి తమిళనాడు కేంద్రంగా నాలుగు రైళ్లను కేటాయించి… ప్రారంభించేలా నిర్ణయం. తాంబరం-మంగళూరు AB ఎక్స్‌ప్రెస్‌ మంగళూరు జంక్షన్ నుండి వీక్లీ సర్వీసుగా ఖరారు చేసారు.

pm-modi-flag-off-four-nagercoil-Charlapalli-amrit-bharat-express-from-madurai-on-m-1st

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ప్రయోజనకరంగా

గత నెల జనవరి 27వ తేదీన ప్రారంభమైన చర్లపల్లి-తిరువనంతపురం నార్త్ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అంచనా. ఈ రైలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాక పోకలు సాగుతోంది. ఈ రైలు మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తర్వాత రోజు 14.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై ఎగ్మోర్, తిరూచీ, మధురై, కొల్లం స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్, ప్యాంట్రీ కార్ కోచ్‌లు ఉన్నాయి. కాగా ఇప్పుడు మరో రైలు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రెండు తెలుగు రాష్ట్రాల సాధారణ రూట్‌లోనే చర్లపల్లికి చేరుకునే విధంగా ఖరారు చేసారు. రైలు వేళలు.. స్టాపుల గురించి రైల్వే అధికారులు ఈ రోజు లేదా రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular