Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఏపీలో జైళ్ళలోనూ అంగన్వాడీ కేంద్రాలు.. శాసనసభలో ప్రకటించిన హోంమంత్రి | మహిళా ఖైదీల పిల్లల కోసం...

ఏపీలో జైళ్ళలోనూ అంగన్వాడీ కేంద్రాలు.. శాసనసభలో ప్రకటించిన హోంమంత్రి | మహిళా ఖైదీల పిల్లల కోసం జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఏపీ ప్రభుత్వం: అసెంబ్లీలో మంత్రి అనిత

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. రాష్ట్రంలో జైళ్లలో ఉన్న ఖైదీల విషయంలో కూడా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తుంది. ఇదే విధమైన మహిళా ఖైదీల పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు నేడు హోం మంత్రి వంపూడి అనిత.

అసెంబ్లీలో జైళ్ళు, సంస్కరణల సవరణ బిల్లు ఆమోదం

నేడు, సంస్కరణల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, దీనికి శాసనసభలో ఆమోదం లభించింది. ఈ సమయంలోనే జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు హోం మంత్రి అనిత. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అనిత, ఖైదీల క్షమాభిక్ష ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించారు. కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్రంలో జైలు సంస్కరణలు అమలు చేసేందుకు వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

మహిళా ఖైదీల పిల్లల కోసం జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో మంత్రి అనిత

జైళ్ళు పరివర్తన నిలయాలు

జైలు జీవితంలోనే ఖైదీలు చాలా నేర్చుకుంటున్నారని, జైళ్ళు ఖైదీలకు పరివర్తన నిలయాలని ఆమె అన్నారు. జైళ్లలో ఖైదీలకు ఉన్నత విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి అనిత వివరించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి చట్టంలో మార్పులు అవసరమని అనిత అభిప్రాయపడ్డారు. ఖైదీలను వారి నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగా వర్గీకరిస్తామన్నారు.

ఖైదీల కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లను ఏర్పాటు చేశారు

ఈ సంస్కరణల్లో భాగంగానే, ఖైదీల మానసిక పరివర్తన కోసం ఓపెన్ ఎయిర్ జైళ్లను ఏర్పాటు చేసి, వ్యవసాయంతోపాటు ఇతర వృత్తులను నేర్పే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం వంగలపూడి అనిత అన్నారు.మరోవైపు, పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లలో సౌకర్యాల కొరత ఉందని ఆయన ప్రశ్నించారు. ఖైదీల సంఖ్య పెరుగుతున్నా, సౌకర్యాలు మెరుగుపడటం లేదని ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

జైళ్ళలో పరిస్థితులపై మాట్లాడిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర

జైళ్ల శాఖలో 30 శాతం పోస్టులు, ముఖ్యంగా మహిళా సిబ్బంది లోటు ఉందని ధూళిపాళ్ళ నరేంద్ర గుర్తు చేశారు. న్యాయ సహాయం లేకపోవడంతో చాలా మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని ఆయన అన్నారు. చిన్న కేసులలో మంచి ప్రవర్తన వెంటనే కనబరిచిన రిమాండ్ ఖైదీలను విడుదల చేయాలని ధూళిపాళ్ళ నరేంద్ర సూచించారు.

ఖైదీల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి

జైలు నుంచి విడుదలైన తర్వాత వారు సమాజంలో గౌరవంగా జీవించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. అరవై ఏళ్లు పైబడిన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కూడా ధూళిపాళ్ల నరేంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలోనే జైళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై, క్షమాభిక్ష ఖైదీల విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular