ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్రప్రదేశ్’, ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహించోంఫీ. ‘చెత్త నుండి సంపద’ సృష్టినే ఆశయంతో రాష్ట్రవ్యాప్తంగా వినూత్నంగా అమలు చేయడానికి సంకల్పించింది కూటమి సర్కార్. ఇక తాజాగా చెత్త నుండి సంపద సృష్టి జరుగుతుందని ప్రభుత్వం చెత్త ఇస్తే సరుకులు ఇస్తారని ప్రచారం చేస్తుంది.
ప్రతి మండలంలో స్వచ్ఛ రథం
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలంలో “స్వచ్ఛ రథం” ఏర్పాటు చేశారు.వారానికి ఒక రోజు రథం గ్రామాలకు చేరుకుని చెత్త సేకరణ చేపడుతుందని తెలిపారు.ప్రజలు చెత్త ఇవ్వడం ద్వారా ఉచిత నిత్యావసర సరుకులు పొందే అవకాశం కల్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోనుందని తెలిపారు.

ఏపీలో చెత్తకు సంపద పథకం
“స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర” లక్ష్యంగా ప్రభుత్వం ముందుడుగు వేస్తోందని ఆయన అన్నారు. నిన్న పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంటింటికీ చెత్త డబ్బాలు పంపిణీ, తడి-పొడి చెత్తను సేకరించాలని సూచించడం, చాలా చోట్ల నిబంధనలు లేకపోవడం సమస్యగా మారింది. దీనికి ‘చెత్తకు సంపద’ పరిష్కారంగా చంద్రబాబు.
చెత్త ఇస్తే సరుకులు
ఈ పథకం కింద తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ఉచితంగా కూరగాయలు, పప్పులు అందిస్తారు. గుంటూరు జిల్లాలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతూ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంట్లో ఉపయోగంలో లేని వస్తువులను కూడా సేకరించి వాటి విలువకు అనుగుణంగా సరుకులు అందించారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ నమూనాను ప్రభుత్వం విస్తరిస్తోంది.
ప్రతీ మండలానికి స్వచ్చ రథాలు.. లక్ష్యం ఇదే
ప్రతీ మండలంలో ‘స్వచ్ఛ రథాలు’ కేటాయించి చెత్త సేకరణ, రవాణాను అందిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌ను నియమించి, ముఖ్యంగా మహిళలకు కార్యక్రమం ప్రయోజనాలు వివరించబడతాయి. గ్రామీణతడి చెత్త ద్వారా సెంట్రల్ ఉత్పత్తి సాధ్యమవుతుండగా, ప్రజలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని పెంచే సమగ్ర విధానాన్ని ప్రభుత్వం ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’గా లక్ష్యంగా పెట్టుకుంది.

