Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఈసారి దంచికొట్టనున్న ఎండలు, జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖాధికారులు! | తెలంగాణలో వేడిగాలులు: వాతావరణ శాఖ...

ఈసారి దంచికొట్టనున్న ఎండలు, జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖాధికారులు! | తెలంగాణలో వేడిగాలులు: వాతావరణ శాఖ అధికారులు ఈసారి ఉక్కపోత, ప్రజలను అప్రమత్తం

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులకు లోనవుతుంది. ఫిబ్రవరి మాసంలోనే తెలంగాణలో భానుడి భగభగ మండుతున్నాడు. పగటిపూట తీవ్రమైన ఎండలు, రాత్రిపూట అధిక ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్చి నుండి సాధారణంగా పెరిగే ఎండలు ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలు కావడంతో సామాన్యులు బయటకు వస్తే ఇబ్బంది పడుతున్నారు.

ఫిబ్రవరిలోనే ఎక్కువగా ఎండలు

ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ ప్రభావం స్థాయికి చేరుకుంటుంది. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 33 డిగ్రీల నుండి 34.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణలో వేడిగాలులు ఈసారి ఉక్కపోతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు

ఈసారి ఎండలు దంచి కొట్టుడే

ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట కూడా కొన్ని జిల్లాలలో పరిస్థితి ఉంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఈసారి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఎండలు సాధారణం కంటే ఒక డిగ్రీ నుండి 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు

ఈ పరిణామ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఎండలో బయటకు వెళ్లాలనుకుంటే తెల్లని కాటన్ దుస్తులు ధరించి వెళితే మంచిదని చెబుతున్నారు. ఎండాకాలం శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువగా మంచినీరు తాగాలని, ద్రవ ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular