ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇవాళ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి, మాజీ టీడీపీ నేత కూడా అయిన తుమ్మల నాగేశ్వరరావు (tummala nageswara rao) కలిశారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలపై ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చంద్రబాబు సీఎం అయ్యాక తుమ్మల ఏపీకి రావడం ఇదే తొలిసారి.
సీఎం చంద్రబాబుతో ఇవాళ భేటీ అయిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను చర్చించారు. అలాగే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులపైనా ప్రస్తావన తెచ్చారు. వీటిని పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది జరుగుతుందని తుమ్మల చంద్రబాబుకు తెలిపారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పలు వివరాలను సీఎం చంద్రబాబుకు తుమ్మల ప్రదేశం. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారం జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఎన్డీయే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జరిగేలా చూడాలని తుమ్మల చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రస్తుతం చంద్రబాబుకు ఎక్కువ పరపతి ఉంది. ఆయా అంశాలను కేంద్రం సాయంతో పరిష్కరించుకోవాలని తుమ్మల ఈ పర్యటనకు సంబంధించిన సూచనలు.

