ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీలో ఆర్టీసీ (APSRTC)ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలపై ఉద్యోగాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ బస్సుల ఆపరేటర్లకు ఆర్టీసీ బస్సు డిపోలను అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేడు గుర్తింపు ఉద్యోగ సంఘం ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే 20వ తేదీ నుంచి నిరసనలకు దిగుతామని హెచ్చరించింది.
విద్యుత్ ఆపరేటర్లకు ఆర్టీసీ డిపోలు అప్పగింత నిర్ణయం వెనక్కి ప్రభుత్వాన్ని ఎంపిలాయిస్ యూనియన్ ఇవాళ మరోమారు కోరింది. గుంటూరు-2, విద్యాదరపురం డిపోలు ఖాళీ చేయబడలేదు, వాటికి బదులుగా విద్యుత్ బస్సు ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ స్థలాలు సూచించబడ్డాయి. ఉద్యోగ సంఘాలతో వెంటనే సమావేశం నిర్వహించాలని ఈయూ డిమాండ్ చేసింది. బస్సులు ప్రైవేట్ కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే నడపాలని కూడా కోరింది.

ఈ మేరకు ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే విద్యుత్ బస్సు ఆపరేటర్లకు ప్రభుత్వం అప్పగించాలని చూస్తోంది 11 డిపోల వద్ద నిరసనలు ప్రారంభిస్తామని ఈయూ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్, ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య ప్రకటించారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ కు సైతం వీరు లేఖ రాశారు. ఇందులో పీఎం ఈ-బస్ సేవ ఇండోర్ పీపీపీ విధానంలో అమలు చేయడం వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అవుతుందని తెలుస్తుంది.

ఆర్టీసీ ఉద్యోగుల భద్రత, యువత ఉపాధి, ప్రయాణికుల భద్రత, సంస్థ దీర్ఘకాలిక ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపేందుకు ఈ నిర్ణయాలపై ఉద్యోగుల నిరసనను ఆపాలంటే తక్షణ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించాలని ఈయూ నేతలు డిమాండ్ చేశారు.

