Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరైతులకు ఈ కార్డుతో రూ.3లక్షల వరకు గుడ్లు వడ్డీలేని రుణాలు | రూ.3 లక్షల వరకు...

రైతులకు ఈ కార్డుతో రూ.3లక్షల వరకు గుడ్లు వడ్డీలేని రుణాలు | రూ.3 లక్షల వరకు రుణాలతో పాడి రైతులకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యవసాయం చేసే రైతులకే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి కూడా అనేక పథకాలను అందిస్తూ వారి కేంద్రం ప్రోత్సహిస్తుంది. ఇక కేంద్రం అందించే పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నాయి. ఇక కేంద్ర పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది.

పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తోంది. పశు పోషణ, దాణా కొనుగోలు వంటి అవసరాలకు రైతులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందే సౌకర్యాన్ని కల్పించింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునేలా వెసులుబాటు కల్పించారు

రూ. 3 లక్షల వరకు రుణాలతో పాడి రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

1.60 లక్షల రూపాయల వరకు ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా

ఇందులో 1.60 లక్షల రూపాయల వరకు ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా చేస్తారు. ఈ ఉన్న 40 రోజుల్లో తిరిగి చెల్లిస్తే దానిపైన వడ్డీ వర్తించదు. ఒకవేళ చెల్లించలేకపోతే ఆ తర్వాత ఏడు శాతం వడ్డీ తోటి చెల్లించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు సంవత్సరంలోపు రుణం తిరిగి చెల్లించిన రైతులకు rbi నుండి, నాబార్డ్ నుండి మూడు శాతం వడ్డీ మినహాయింపు లభిస్తుంది.

పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయండి

ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే అవకాశం కూడా ఈ కార్డుల ద్వారా అందుబాటులో ఉంటుంది. మరి ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల కోసం, ముఖ్యంగా పశువుల కోసం ఇచ్చే పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుకు సంబంధించిన వివరాల కోసం సమీప పశుసంవర్ధక శాఖ సహాయకులను సంప్రదించాలని తెలిపారు.

పాడి రైతులు పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో ఈ కేవైసీ తప్పనిసరి

అర్హత ఉన్న వారికి కార్డుతో పాటు పాస్‌బుక్ కూడా అందజేస్తారని, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని చెబుతున్నారు. అర్హులైన పాడిన రైతులందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ కేవైసీ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులు, భూమి పత్రాలు, పశువుల ఆరోగ్య రికార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు బెనిఫిట్ పొందండి

మరి ఇంకెందుకు ఆలస్యం కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోండి. లేనివారు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని పొందండి, కేంద్ర ప్రభుత్వం అందించే బెనిఫిట్ ను పొందే ప్రయత్నం చేయండి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular