Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణతిరుమలలో విశేష ఘట్టం.. క్షేత్రపాలక ఉత్సవం | తిరుమలలోని క్షేత్రపాలక రుద్రుడు మహా శివరాత్రి సందర్భంగా...

తిరుమలలో విశేష ఘట్టం.. క్షేత్రపాలక ఉత్సవం | తిరుమలలోని క్షేత్రపాలక రుద్రుడు మహా శివరాత్రి సందర్భంగా పవిత్ర ఆదివారం నాడు అభిషేకం స్వీకరిస్తారు.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

తిరుమలలో భక్తుల ప్రదర్శన. శనివారం నాడు 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,825 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.58 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

తిరుమలలో మహా శివరాత్రి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రాలకు ప్రత్యేకంగా అభిషేకించారు టీటీడీ అర్చకులు. తిరుమల క్షేత్రపాలకుడు.. రుద్రుడు. గోగర్భం సమీపంలో ఉంటుందీ ఆలయం. రుద్రుడి ప్రతిరూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రుద్రుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమలలోని క్షేత్రపాలక రుద్రుడు మహా శివరాత్రి సందర్భంగా పవిత్ర ఆదివారం నాడు అభిషేకం స్వీకరిస్తారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా అధికారులు, అర్చకులు క్షేత్రపాలక రుద్రశిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular