Thursday, March 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఓటేశానని దేవుడిమీద ఒట్టెయ్.. లేదంటే డబ్బులిచ్చేయ్: షాకింగ్ వైరల్ వీడియో! | మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్...

ఓటేశానని దేవుడిమీద ఒట్టెయ్.. లేదంటే డబ్బులిచ్చేయ్: షాకింగ్ వైరల్ వీడియో! | మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చనిపోయిన బిజెపి అభ్యర్థి డబ్బు తిరిగి ఇవ్వాలని ఓటర్లను కోరిన వీడియో వైరల్

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

రాష్ట్రంలో 2026 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్‌లో అనేక ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు షాక్ కు గురి చేసే అనేక వీడియోలు వైరల్ గా మారాయి. ఎన్నికలలో ఓటు వేయడానికి డబ్బులను, వస్తువులను ఇచ్చిన కొందరు ఓటు వేయని వారి నుండి తిరిగి తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

డబ్బులిచ్చినా ఓటు వెయ్యని వారి లెక్క తేల్చేపనిలో అభ్యర్థులు

తాజాగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 9వ డివిజన్ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి జాది తిరుపతి ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. ఆయన 16 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థితో ఓడిపోయారు. ఇక ఓటమితో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు ఓటేస్తామని హామీ ఇచ్చి తమ వద్ద నగదు తీసుకున్న వారి లెక్క తేల్చే పనిలో పడ్డారు.

మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చనిపోయిన బిజెపి అభ్యర్థి డబ్బు తిరిగి ఇవ్వాలని ఓటర్లను కోరిన వీడియో వైరల్

ఒట్టేసి చెప్పమని ప్రశ్న.. ఓటు వెయ్యకుంటే ఇచ్చిన డబ్బులు వసూలు

ఇంటింటికి తిరుగుతూ వారికి ఓటు వేశారా లేదా అనేది ఎంక్వయిరీ చేస్తూ, ఒట్టేసి చెప్పమని ప్రశ్నిస్తున్నారు. తమకు ఓటు వేసాము అని చెప్పిన వారిని వదిలేసి, ఓటు వేయని వారి నుండి రిటర్న్ డబ్బులు తీసుకుంటున్నారు. ఓటుకు మూడు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఆ డబ్బులను తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఆయన భార్య రూప ప్రతి ఇంటికి వెళ్లి తన భర్త తిరుపతికి ఓటు వేశారని దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటు వేస్తే ఒట్టేసి చెప్పండి, డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని రూప డిమాండ్ చేయడం ఆ వీడియోలో ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వృద్ధుల అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

డబ్బులు తిరిగి ఇచ్చిన వీడియో

ఆమె తండ్రి తిరుపతికి ఓటు వేయలేదు, కాబట్టి ఆమె వారికి చెల్లించిన రూ. 3000 తిరిగి ఇచ్చింది. తాను ఓటు వేసింది కాబట్టి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక ఈ వీడియో ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెడుతున్న అభ్యర్థుల తీరును, నోటుకు ఓటు అమ్ముకుంటున్న ఓటర్లను కళ్ళకు కడుతుంది.

అధికారుల దృష్టి సారిస్తారా?

ప్రభుత్వాలు ప్రజలలో ఓటు హక్కుపై చైతన్యం తీసుకురావడానికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇంకా ఓటర్లు ప్రలోభాల కోసం చూస్తున్నారని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం. మరి ఇలాంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అయినా అధికారులు వీటిపై దృష్టి సారిస్తారా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular