తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ప్రతి చిన్న విషయానికి ఎక్కువ హడావిడి చేసే పాడి కౌశిక్ రెడ్డి కి హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు ప్రకటించుకున్న ఆయనకు ఝలక్ ఇచ్చారు.
హుజూరాబాద్ లో కాంగ్రెస్ హవా
వీణవంక ని తగలబెడతాం అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీ జెండాను హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు తగలబెట్టారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. ఏకంగా 16 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని. అధికార బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితమై గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

పని తక్కువ హంగామా ఎక్కువ చేసే పాడి కౌశిక్ రెడ్డికి షాక్
బిజెపి 5 వార్డులలో మాత్రమే గెలిచి మూడవ స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల అసెంబ్లీ సమయంలో సెంటిమెంట్ అస్త్రంతో విజయం సాధించిన కౌశిక్ రెడ్డి ఆ తర్వాత అనేక వివాదాలలో హైలెట్ కావడం, అభివృద్ధి నియోజకవర్గం కంటే హడావిడి చేయడం పైనే దృష్టి సారించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధంగానే ఈ ఎన్నికలలో పాడి కౌశిక్ రెడ్డి ఎంత ప్రచారం చేసినప్పటికీ హుజురాబాద్ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించలేదు.
కాంగ్రెస్ కు పట్టం కట్టిన హుజూరాబాద్ ప్రజలు
లోకల్ ఎమ్మెల్యేగా అతని పట్ల ప్రజల వ్యతిరేకత వ్యక్తమౌతుంది అని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ పార్టీ పనిచేస్తుందో ఆలోచించి, గెలిపించాలని భావించిన హుజురాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
ఈటెల రాజేందర్ కు షాక్ ఇచ్చిన మున్సిపల్ ప్రజలు
ఇక్కడ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డికి మాత్రమే కాదు, ఒకప్పుడు ఈటెల రాజేందర్ కి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో బిజెపికి కూడా షాక్ ఇచ్చారు. హుజరాబాద్ లో బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తానికి హుజురాబాద్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది.

