Friday, April 10, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవందేభారత్ స్లీపర్,అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోట ! వర్తింపు ఇలా..! | కొత్త రూల్:...

వందేభారత్ స్లీపర్,అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోట ! వర్తింపు ఇలా..! | కొత్త రూల్: వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ రైళ్లలో ఇప్పుడు ఎమర్జెన్సీ కోటా అందుబాటులో ఉంది

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

మన దేశంలో ప్రస్తుతం ప్రీమియం రైళ్లుగా పరిగణిస్తున్న వందే భారత్ స్లీపర్ (vande bharat sleeper), అమృత్ భారత్ (amrit bharat) రైళ్లపై రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రైళ్లలో ఆర్ఏసీ కోట ఉండబోదని గతంలో ప్రకటించిన రైల్వే బోర్డు తాజాగా మనసు మార్చుకుంది. ఈ నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా అధికారులకు ఆదేశాలు పంపింది. దీంతో ఇకపై టికెట్ల బుకింగ్ లో ఎమర్జెన్సీ కోటా (ఎమర్జెన్సీ కోటా) అమల్లోకి రాబోతోంది.

అమృత్ భారత్ లో ఎమర్జెన్సీ కోటా ఇలా (అత్యవసర కోటా)

రైల్వే బోర్డు తాజా నిర్ణయం ప్రాకంర వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో అత్యవసర కోటాను ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు గత నెలలో తీసుకున్న ఆర్ఏసీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏడు లేదా అంతకంటే ఎక్కువ స్లీపర్-క్లాస్ కోచ్‌లు ఉన్న అమృత్ భారత్ రైళ్లలో 24 అత్యవసర బెర్త్‌లు కేటాయిస్తారు. ఈ మేరకు అన్ని రైల్వే జోన్‌లలోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు రైల్వే బోర్డు ఆదేశాలు పంపింది.

కొత్త రూల్ ఎమర్జెన్సీ కోటా ఇప్పుడు వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ రైళ్లలో అందుబాటులో ఉంది

వందే భారత్ స్లీపర్ లో కోట ఇలా

వందే భారత్ స్లీపర్ రైళ్లలో అత్యవసర కోట కేటాయింపుపైనా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఫస్ట్ ఏసీ కోచ్ లలో వారం మొత్తం నాలుగు బెర్త్‌లు, వారాంతంలో ఆరు బెర్త్‌లు కేటాయిస్తారు. సెకండ్ ఏసీలో వారం మొత్తం 20 బెర్త్‌లు, వారాంతంలో 30 బెర్త్‌లు కేటాయిస్తారు. అలాగే థర్డ్ ఏసీలో వారం మొత్తం 24 బెర్త్‌లు, వారాంతంలో 42 బెర్త్‌లు కేటాయిస్తారు. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని అత్యవసర కోటలను డిమాండ్, బెర్త్ లభ్యత ఆధారంగా కాలానుగుణంగా సమీక్షించడాన్ని కూడా రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది.

కొత్త రూల్ ఎమర్జెన్సీ కోటా ఇప్పుడు వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ రైళ్లలో అందుబాటులో ఉంది

మిగిలిన కోట్లు ఇలా…

అయితే వందే స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో మహిళలు, వికలాంగులైన ప్రయాణికులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే రిజర్వేషన్ కోటాలు ఉంటాయని, ఇతర కోటాలు దరఖాస్తువని రైల్వే బోర్డు ఇప్పటికే నిర్ణయించింది.కాబట్టి ఆ కోటాల్లో ఎలాంటి మార్పులు లేవు. తాజాగా ప్రారంభించిన ఈ ప్రీమియం రైళ్లకూ ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ, డిమాండ్ల ఆధారంగా రైల్వే బోర్డు తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular