Monday, April 20, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణJeffrey Epstein చనిపోయినా ఫైల్స్ బయటకు. ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్? | జెఫ్రీ ఎప్స్టీన్ స్కాండల్:...

Jeffrey Epstein చనిపోయినా ఫైల్స్ బయటకు. ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్? | జెఫ్రీ ఎప్స్టీన్ స్కాండల్: సీక్రెట్ ఫైల్స్, గ్లోబల్ ఎలైట్స్ అండ్ ది మిస్టరీ బిహైండ్ అతని జైలు డెత్, డార్క్ సీక్రెట్స్

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయి-లింగారెడ్డి గజ్జల

ప్రపంచానికి నైతికతలు బోధించే వేదికల వెనుక ఎంత చీకటి దాగి ఉండొచ్చో చూపించిన ఘోర ఉదంతం జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) కథ. టీచర్‌గా ప్రారంభమై ఇన్వెస్టర్‌గా ఎదిగి, ప్రభావవంతుల మధ్య లాబీయిస్ట్‌గా చలామణి అయిన అతడు… టీనేజ్‌ బాలికలను ఉచ్చులోకి దించి అక్రమ సామ్రాజ్యంతో అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేశాడు. అతని ప్రైవేట్ పార్టీల్లో ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, రాజ కుటుంబాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడం ప్రపంచాన్ని అవాక్కు చేసింది. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన లక్షల ఫైళ్లు, వేల ఫోటోలు, వీడియోలు ఆ చీకటి చరిత్రను మళ్లీ ప్రపంచానికి తెచ్చాయి.

ఎవరీ Jeffrey Epstein?

1953లో న్యూయార్క్‌ బ్రూక్లిన్‌లో జన్మించిన ఎప్‌స్టీన్ సాధారణ కుటుంబంలో పెరిగాడు. చదువులో అంతగా రాణించకపోయినా గణితంలో నైపుణ్యం సంపాదించాడు. డిగ్రీ పూర్తిచేయకపోయినా 1970లలో ప్రముఖ డాల్టన్‌ స్కూల్‌లో గణితం, ఫిజిక్స్‌ బోధకుడిగా చేరాడు. అయితే విద్యార్థులతో అనుచిత ప్రవర్తన కారణంగా రెండు సంవత్సరాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పరిచయాల ద్వారా వాల్‌స్ట్రీట్‌లోకి అడుగుపెట్టి, ఆర్థిక రంగంలో వేగంగా ఎదిగాడు.

జెఫ్రీ ఎప్స్టీన్ స్కాండల్ సీక్రెట్ ఫైల్స్ గ్లోబల్ ఎలైట్స్ అండ్ ది మిస్టరీ బిహైండ్ అతని జైలు డెత్ డార్క్ సీక్రెట్స్

మిస్టరీ వాతావరణం..

వాల్‌స్ట్రీట్‌లో అనుభవం అతనికి సంపన్న వర్గాల్లో ప్రవేశం కల్పించింది. కొద్ది కాలంలోనే సొంతంగా ఆస్తి నిర్వహణ సంస్థను స్థాపించాడు. ఈ సమయంలోనే ప్రభావవంతులైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో అతనికి సన్నిహిత సంబంధాలు పెరిగాయి. తనను తాను గూఢచారి సంస్థలతో సంబంధాలున్న వ్యక్తిగా చెప్పుకుంటూ మరింత మిస్టరీ వాతావరణం సృష్టించేవాడని అప్పటి పరిచయస్తులు చెబుతారు.

వర్జిన్ ఐలాండ్స్‌లో ప్రైవేట్ ద్వీపం..

అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో ఫ్లోరిడా, న్యూయార్క్‌, న్యూ మెక్సికో ప్రాంతాల్లో భారీ ఆస్తులు కొనుగోలు చేశాడు. వర్జిన్‌ ఐలాండ్స్‌లో ప్రైవేట్‌ ద్వీపాన్ని సొంతం చేసుకొని అక్కడ రహస్య సమావేశాలు, పార్టీలను నిర్వహించేవాడు. అతడి ప్రైవేట్‌ జెట్‌ విమానం తరచూ ప్రముఖులను తీసుకెళ్లేదని, ఆ ప్రయాణాల రికార్డుల తర్వాత వివాదానికి దారితీశాయని వెల్లడైంది.

దోషిగా తేలినా బయటకు వచ్చాడు..

2005లో మైనర్ బాలికపై శస్త్ర చికిత్స కేసు నమోదవడంతో అతని చీకటి ప్రపంచం బహిర్గతమైంది. 2008లో దోషిగా తేలినా తేలికపాటి శిక్షతో బయటకు రావడం విమర్శలకు దారితీసింది. అయితే 2019లో మళ్లీ అరెస్ట్‌ అయిన కొద్ది రోజులకే జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించిన, కేసు చుట్టూ కుట్ర సిద్ధాంతాలు చెలరేగాయి.

బ్రిటిష్ రాజభవనం నుంచి అమెరికా రాయబార కార్యాలయం వరకు..

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్ ప్రభావం ఎంతటిదంటే, అది ఏకంగా బ్రిటన్ రాజకుటుంబీకుల బిరుదులనే ఊడబీకింది. బాధితురాలు వర్జీనియా గియూఫ్రే ఆరోపణలతో ప్రిన్స్ ఆండ్రూ తన రాజ మర్యాదలను కోల్పోగా, 2025లో బ్రిటిష్ రాయబారి పీటర్ మాడెల్సన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎప్‌స్టీన్‌తో ఉన్న స్నేహం ఒక రాజకీయ వ్యర్థంగా మారి, దశాబ్దాల కెరీర్‌లను చిటికెలో భస్మం చేస్తోంది. “నేను దెయ్యనివి అనుకుంటున్నావా?” అని గతంలో ఎప్‌స్టీన్‌ ఎదుర్కొన్న ప్రశ్నలు, నేడు అతడితో సాన్నిహిత్యం నెరిపిన ప్రతి ఒక్కరినీ ‘నైతిక విచారణ’ ఎదుట నిలబెడుతోంది.

మాక్స్‌వెల్ శిక్ష – వ్యవస్థకు గుణపాఠం

ఈ కథలో గిస్లెయిన్ మాక్స్‌వెల్ పాత్ర అత్యంత హేయమైనది. ఆక్స్‌ఫర్డ్ విద్యావంతురాలై ఉండి, తోటి ఆడపిల్లలను వేటాడి ఎప్స్‌టిన్‌కు ఎరగా వేయడంలో ఆమె చూపిన తెగింపు విస్తుగొలుపుతుంది. ఆమెకు విధించిన 20 ఏళ్ల జైలు శిక్ష బాధితులకు కొంత ఊరటనిచ్చినా, ఎపిస్టీన్ వంటి వ్యక్తుల వ్యవస్థలోని లొసుగులను వాడుకుని దశాబ్దాల పాటు ఎలా తప్పించుకోగలుగుతున్నారనేది ప్రధాన ప్రశ్న. మాక్స్‌వెల్ అప్పీల్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడం ద్వారా, సంపద మరియు హోదా చట్టం నుంచి రక్షణ కల్పించలేవని న్యాయవ్యవస్థ స్పష్టమైన సందేశం ఇచ్చింది.

నిజం ఎప్పుడు బయటపడుతుంది?

ప్రస్తుతం విడుదలవుతున్న పత్రాలు ‘పూర్తి సత్యం’ కాదని డెమొక్రాట్లు చేస్తున్న వాదనలో బలం లేకపోలేదు. డిసెంబర్ 19 గడువు ముగిసింది, మరిన్ని ఫైళ్లను న్యాయశాఖ గోప్యంగా ఉంచడం వెనుక ఇంకా ఏ ‘పెద్ద తలకాయలు’ ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎపిస్టీన్ కేసు కేవలం ఒక నేర విచారణ కాదు; అది గ్లోబల్ ఎలైట్ గ్రూప్స్ (గ్లోబల్ ఎలైట్స్) తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నడిపిన ఒక సమాంతర వ్యవస్థపై యుద్ధం. ఈ ఫైళ్లన్నీ బహిర్గతమైతే తప్ప, ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా రవాణా చేస్తే వేలాది మంది బాధితులకు న్యాయం జరిగినట్లు కాదు.

ఇటీవల విడుదలైన ఫైళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు రావడం మళ్లీ చర్చలకు దారితీసింది. అయితే ఫ్లైట్ లాగ్స్, పరిచయస్తుల పేరు తప్పనిసరిగా నేరానికి సమానం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ వ్యవహారం ప్రభావ వంతుల బాధ్యత, నైతికతలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జైల్లోనే ముగిసిపోయిన ఎపిస్టీన్‌ జీవితం… కానీ అతడు వదిలిన ప్రశ్నలు ఇంకా సమాధానాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. శక్తి, డబ్బు, ప్రభావం కలిసి నైతికతను ఎలా మసకబార్చగలవో ఈ ఘటన ఒక అద్భుతమైన గుర్తు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular