Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమంచు కొండల్లో మైమరిపించే 'ఇగ్లూ విలేజ్'.. ఎలా చేరుకోవాలి..? | హిమాచల్‌లోని sethan భారతదేశపు మొదటి...

మంచు కొండల్లో మైమరిపించే ‘ఇగ్లూ విలేజ్’.. ఎలా చేరుకోవాలి..? | హిమాచల్‌లోని sethan భారతదేశపు మొదటి ఇగ్లూ గ్రామం – ఇక్కడ పర్యాటకులు మాయా మంచు బస కోసం క్యూలో ఉన్నారు!

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఇక్కడ వింటర్ సీజన్ లో ఎటు చూసినా శ్వేత వర్ణంతో నిండిపోయి ఉంటుంది. ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలు మంచు దుప్పటితో కప్పేసినట్లుగా ఉంటాయి. టూరిస్టులు జనవరి, ఫిబ్రవరి సీజన్‌లో ఈ గ్రామాలను సందర్శించేందుకు ఇష్టపడతారు. ఈ గ్రామాల్లో ఇగ్లూ ఆకారపు ఇళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చుట్టూ తెల్లని మంచు కొండలు.. పైనుంచి సన్నగా మంచు వర్షం పడుతుంటే.. ఇక్కడి ఇగ్లూ కేఫ్స్‌లో హాట్ హాట్ టీ, కాఫీతో పాటు ఇక్కడి సంప్రదాయ వంటకాలు తింటుంటే ఆ అనుభూతే వేరు అని పర్యాటకులు చెబుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక గ్రామాలు ఈ సీజన్‌లో మంచుతో కప్పబడి ఉంటాయి. అయితే హిమాచల్ ని సేథన్ గ్రామం ఇప్పుడు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రకృతి సాహస యాత్రికుల నుండి ప్రేమికుల వరకు అందరూ తరలివస్తున్నారు. ఎందుకంటే ఈ సేథన్ గ్రామం ఇప్పుడు ‘ఇగ్లూ విలేజ్’ గా మారిపోయింది. దాంతో ఈ ఇగ్లూ విలేజ్ విశేషాలను తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ గ్రామం.. హిమాచల్ లోని కులు లోయలో, సముద్ర మట్టానికి సుమారు 2,700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే ఈ గ్రామం మనాలికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చిన్న గ్రామం ఇప్పుడు దేశంలోనే తొలి ఇగ్లూ విలేజ్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది. దాంతో టూరిస్టులు ఈ క్యూ కడుతున్నారు. విదేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఇగ్లూ ఇళ్లు ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులోకి రావడంతో పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

హిమాచల్‌లోని సేతన్ భారతదేశంలోని మొదటి ఇగ్లూ గ్రామం, ఇక్కడ పర్యాటకులు మాయా మంచు బస కోసం క్యూలో ఉన్నారు

ఇక ఇగ్లూ ఇళ్ల ప్రత్యేకత ఏంటంటే..? బయట గడ్డకట్టేంత చలి ఉన్నా ఇగ్లూ లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. బయట మైనస్ డిగ్రీల్లో చలి ఉంటుంది.. ఇగ్లూ లోపల బయటి కంటే దాదాపు 8 నుంచి 10 డిగ్రీల వరకు ఎక్కువ వేడి ఉంటుంది. మంచు గోడలు బయటి గాలిని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడమే దీనికి మూల కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఇక సేథన్ గ్రామంలో ఇగ్లూ బస మాత్రమే కాదు.. గుర్రపు స్వారీ, ట్రెక్కింగ్, స్కీయింగ్, స్నోబోర్డింగ్ తదితర క్రీడలు అందుబాటులో ఉన్నాయి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular