Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేష్ అనూహ్య రాజకీయ నిర్ణయం.. బిగ్ ప్లాన్! | ఏపీ రాజకీయాల్లో...

ఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేష్ అనూహ్య రాజకీయ నిర్ణయం.. బిగ్ ప్లాన్! | ఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేశ్ సంచలన రాజకీయ నిర్ణయం.. సీఎం ఫ్యూచర్ టార్గెట్ పెద్ద కథ!

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఏపీ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారా? భవిష్యత్తులో సీఎం అవ్వాలన్న ఆలోచనలో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? పార్టీ పైన పట్టు సాధించడం కోసం, పార్టీ ఎమ్మెల్యేలను తన వారిగా మార్చుకోవడం కోసం రంగంలోకి దిగారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

నారా లోకేష్ కీలక రాజకీయ నిర్ణయం

రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించడానికి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీపైన, సీఎం పీఠం పైన ఆధిపత్యం చెలాయించాలని కోరుకునే నారా లోకేష్ దానికోసం కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు, ఆ భేటీల ద్వారా ఆ నియోజకవర్గాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని లోకేష్ ఆలోచిస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో మంత్రి లోకేష్ సంచలన రాజకీయ నిర్ణయం సీఎం భవిష్యత్తు లక్ష్యంగా పెద్ద కథ

లోకేష్ తో ఎమ్మెల్యేలు నేరుగా చర్చించే అవకాశం

ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఈ భేటీ వల్ల, నారా లోకేష్ పట్ల వారికి సానుకూలత వస్తుంది అనేది కూడా ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది. ఈ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి ఎమ్మెల్యేలు లోకేష్‌తో నేరుగా చర్చించే అవకాశం ఉంటుంది.

పార్టీపై బలమైన ముద్ర, సీఎం పీఠం కోసం వడివడిగా అడుగులు

నారా అటు పార్టీ-ప్రభుత్వ సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా లోకేష్ ఈ పనిచేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ, దీని వెనక భవిష్యత్తులో పార్టీ పైన బలమైన ముద్ర వేస్తే, సీఎంగా వ్యతిరేకత లేకుండా మద్దతు కూడగట్టే పెద్ద ప్లాన్ ఉంది అనేది అందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

పార్టీలో తన బలపరచే యత్నం

ఈ భేటీలు కేవలం పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా, పార్టీ అంతర్గత రాజకీయాల్లో తన కోసం బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా రాజకీయ వర్గాలను విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

అందరినీ ఏకతాటి మీదకు తెచ్చే ప్లాన్

పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వంపై నమ్మకం పెంచడం, అంతర్గత అసంతృప్తులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు పార్టీలు చెబుతున్నాయి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular