ప్రపంచంలోనే ప్రభుత్వం నడుపుతూ వన్ స్టార్ రేటింగ్ కలిగిన ఏకైక విమానయాన సంస్ధ ఉత్తర కొరియాలో ఉంది.
అంతర్జాతీయ
-సయ్యద్ అహ్మద్
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దాదాపుగా ఎయిర్ లైన్ (airline) సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వాలు నడుపుతుంటే, ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయి. పలు చోట్ల ప్రభుత్వాలు ఎయిర్ లైన్స్ ను నిర్వహించలేక ప్రైవేటుకు ఇస్తున్నాయి. మన దేశంలోనూ ఎయిర్ ఇండియాను ఒకసారి టాటాల నుంచి జాతీయీకరణ చేసిన కేంద్రం.. తిరిగి దాన్ని నిర్వహించలేక దశాబ్దాల తర్వాత మళ్లీ టాటాలకే అమ్మేసింది. అయితే విమానయాన సంస్థలు అందించే సేవలు, నిర్వహణ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వాటి రేటింగ్‌లు కూడా ఇస్తారు.
ప్రపంచంలోనే చెత్త ఎయిర్ లైన్స్ (ఎయిర్‌లైన్)
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్ సంస్థలకు వాటి పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఇచ్చే స్కైట్రాక్స్ సంస్థ చెత్త విమాన యాన సంస్థను ఒకదానిని గుర్తించి, దానికి ఏకంగా వన్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. అలా అని ఎయిర్ లైన్స్ ఏదైనా ప్రైవేట్ సంస్థ నడుపుతుందా అంటే అది కాదు. ఇది ఏకంగా ఓ దేశ ప్రభుత్వం నడుపుతున్న ఎయిర్ లైన్స్ సంస్థే. దీని పేరు ఎయిర్ కోర్యో (air koryo). దీన్ని నడుపుతోంది ఉత్తర కొరియా ప్రభుత్వం. కిమ్ పాలనలో ఉన్న నియంత ప్రభుత్వమే దీన్ని నడుపుతోంది. ఇది ప్రపంచంలోనే ఏకైక వన్-స్టార్ రేటింగ్ ఎయిర్ లైన్ కావడం మరో విశేషం.

ఎయిర్ కోర్యో ఎయిర్ లైన్స్
అయితే ప్రపంచంలోనే ఏకైక వన్-స్టార్ ఎయిర్‌లైన్‌గా ఎయిర్ కోర్యో ఎందుకు నిలిచిందంటే.. పాతకాలపు విమానయానాన్ని, కఠినమైన నిబంధనలను, విశిష్టమైన ఉత్తర కొరియా విమాన అనుభవాన్ని మిళితం చేస్తుంది. ఎయిర్ కొర్యో ఉత్తర కొరియా జాతీయ విమానయాన సంస్థ, దేశంలో ఉన్న ఏకైక వాణిజ్య విమానయాన సంస్థ కూడా. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. దేశ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేస్తుంది. ఈ సైన్యంతో సంబంధాలుంటాయి. ఎయిర్ కొర్యో విమాన ప్రయాణం మనాల్లో విమానాలు ఉండదు. ఇది పాతకాలపు అనుభూతిని కలిగిస్తుంది. ప్రయాణికులు తమకు కలిగిన అరుదైన అనుభవాలను ఆన్‌లైన్‌లో పంచుకుంటారు. అలాగే ఈ ఎయిర్ లైన్స్ లో పాతకాలం నాటి లగేజీ తూకం వేసే స్కెల్స్ ను వాడుతుంటారు.

ఎయిర్ కోర్యో ప్రస్థానం-చెత్త రికార్డు
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్-ఉత్తర కొరియా ఉమ్మడి సంస్థగా ఎయిర్ కొర్యో మూలాలు ప్రారంభమయ్యాయి. 1955లో ఇది పూర్తిస్థాయి ఉత్తర కొరియా సంస్థగా మారింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ‘కొరియన్ ఎయిర్‌వేస్’ పేరుతో అధికారికంగా స్ధాపించారు. ప్రస్తుతం ఎయిర్ కొర్యో ప్రధాన కార్యాలయం ప్యోంగ్యాంగ్‌లో ఉంది. రాజధానిలోని సునాన్ అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. విమానంలోని ఉత్పత్తులు, సేవల వంటి విభాగాల్లో ఇది చాలా తక్కువ స్కోర్‌ని కలిగి ఉంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఇది వన్-స్టార్ రేటింగ్ లోనే ఉంది. ఇది కేవలం చైనాలోని బీజింగ్, షెన్యాంగ్, రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు వారానికి కొన్ని ట్రిప్‌లు మాత్రమే నడుపుతుంది. దేశీయ ప్రయాణాలు అయితే పూర్తిగా రహస్యంగా ఉంచుతారు.

