Wednesday, April 22, 2026
ads
📄 ePaper
HomeతెలంగాణAPSRTC: ఆర్టీసీలో ప్రైవేటీకరణ చిచ్చు?- సర్కార్ కు ఉద్యోగసంఘాల షాక్..! | APSRTC ఉద్యోగులు ప్రభుత్వ...

APSRTC: ఆర్టీసీలో ప్రైవేటీకరణ చిచ్చు?- సర్కార్ కు ఉద్యోగసంఘాల షాక్..! | APSRTC ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా చర్య తీసుకుంటారని బెదిరించారు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఏపీలో రాష్ట్ర రవాణా సంస్థ (APSRTC)లో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఉద్యోగులకు షాకిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ బస్సుల్ని, ఆర్టీసీ డిపోల్ని సైతం ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై వారు మండిపడుతున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వానికి ఆర్టీసీ గుర్తింపు ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కీలక హెచ్చరికలు పంపింది. తక్షణం ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు.

విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పూణేకు చెందిన పినకల్ కంపెనీకి 11 ఆర్టీసి డిపోల కేటాయింపు నిర్ణయం వెంటనే రద్దు చేసింది ఈయూ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్, సి.ఎన్.జీ, డీజిల్ బస్సులు అన్నీ ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని ప్రభుత్వాన్ని నిర్ధారిస్తున్నారు. అలాగే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానం సంస్థకు నష్టం వాటిల్లుతుందని ఈయూ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ హెచ్చరించారు.

APSRTC ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా చర్య తీసుకుంటారని బెదిరించారు

విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి డిపోలు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయమని ఆయన చెప్పారు. విధ్యుత్ బస్సులకు మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలన్నారు. విద్యుత్తుకు వ్యతిరేకం కాదని, కానీ ప్రెవేటు వారితో కాకుండా బస్సు ఆర్టీసి ద్వారా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరికలు చేసింది.

APSRTC ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా చర్య తీసుకుంటారని బెదిరించారు

మరోవైపు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు జరుగుతున్న భారత్ బంద్ కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా 129 ఎర్ర ఆర్టీసీ డీపోలు, 4 వర్క్‌షాపుల్లో ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై గేట్ మీటింగ్స్ నిర్వహించాలని ఈయూ పిలుపునిచ్చింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగుల గేట్ మీటింగ్ నిరసనలు చేపట్టారు. 4 లేబర్ కోడ్‌ల రద్దు, ప్రైవేటీకరణ-ఔట్‌సోర్సింగ్ నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కనీస పెన్షన్ రూ.10,000 కు పెంచాలని, స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులకు వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీలో 3 వేల కొత్త బస్సులు, 10 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular