Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణట్రంప్ కోసం గొడవ.. కూతురిని కాల్చి చంపిన తండ్రి! | టెక్సాస్ ట్రాజెడీ, డోనాల్డ్ ట్రంప్...

ట్రంప్ కోసం గొడవ.. కూతురిని కాల్చి చంపిన తండ్రి! | టెక్సాస్ ట్రాజెడీ, డోనాల్డ్ ట్రంప్ మరియు తుపాకీలపై వాదన తర్వాత తండ్రి కాల్చి చంపిన బ్రిటిష్ మహిళ, వివరాలు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-జక్కీ మహేష్

రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఒక్కోసారి ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పడానికి టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తుపాకుల వాడకంపై తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనను చూడటానికి వచ్చిన కన్నకూతురినే ఓ తండ్రి తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగిందంటే?
బ్రిటన్‌లోని చెషైర్‌కు చెందిన లూసీ హారిసన్ (23) ఓ ఫ్యాషన్ బయర్‌గా పనిచేస్తోంది. చాలా కాలం తర్వాత తన తండ్రి క్రిస్ హారిసన్‌ను కలిసేందుకు ఆమె తన ప్రియుడు సామ్ లిటిలర్‌తో కలిసి టెక్సాస్‌లోని ప్రాస్పర్ నగరానికి వెళ్లింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, అమెరికాలోని తుపాకీ సంస్కృతి గురించి తండ్రీకూతుళ్ల మధ్య చర్చ మొదలైంది. ఈ చర్చ కాస్తా వాగ్వాదంగా మారింది.

టెక్సాస్ ట్రాజెడీ డోనాల్డ్ ట్రంప్ మరియు తుపాకుల వివరాలపై వాదన తర్వాత తండ్రి కాల్చి చంపిన బ్రిటిష్ మహిళ

మనసు గాయపరిచిన తండ్రి మాటలు
“ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉండి వేధింపులకు గురైతే మీరు ఎలా ఫీల్ అవుతారు?” అని లూసీ తన తండ్రిని సూటిగా ప్రశ్నించింది. దానికి తండ్రి క్రిస్ అత్యంత నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ.. “నాకు మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, అది నన్ను అంతగా బాధించదు” అని వ్యాఖ్యానించాడు. కన్న తండ్రి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు లూసీని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఏడుస్తూ పైఅంతస్తులోకి వెళ్ళిపోయింది.

15 సెకన్ల వ్యవధిలో విషాదాంతం
తండ్రి వద్ద తుపాకీ ఉండటం లూసీకి మొదటి నుంచీ ఇష్టం లేదు. గతంలో కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన రోజు.. లూసీ కిచెన్‌లో ఉండగా, ఆమె చేయి పట్టుకుని తన బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. లూసీ ప్రియుడు సామ్ బయట ఉండగా.. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే గదిలో నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. సామ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి లూసీ రక్తపు మడుగులో పడి ఉంది. తుపాకీ తూటా ఆమె ప్రాణాలను తీసేసింది.

మద్యం మత్తులో తండ్రి ఘాతుకం
కుటుంబ రక్షణ కోసమే తాను తుపాకీ కొన్నానని.. ఆ రోజు కేవలం లూసీకి దాన్ని చూపించడానికి మాత్రమే తీశానని క్రిస్ట్ కోర్టులో వాదించాడు. తనకు తెలియకుండానే గన్ పేలిందని, తన వేలు ట్రిగ్గర్‌పై ఉందో లేదో కూడా గుర్తులేదని బుకాయించాడు. అయితే, క్రిస్‌కు గతంలో మద్యపాన వ్యసనం ఉందని, ఘటన జరిగిన రోజు కూడా ఆయన దాదాపు 500 మి.లీ వైన్ తాగినట్లు విచారణలో తేలింది. “నా కూతురిని కోల్పోయిన బరువును నా జీవితాంతం మోయాల్సిందే” అని ఆయన కోర్టులో వాపోయాడు. ఈ ఘటన కేవలం ఒక హత్య మాత్రమే కాదు.. మితిమీరిన గన్ కల్చర్, రాజకీయ మూర్ఖత్వం కుటుంబ బంధాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఒక చేదు నిదర్శనం.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular